వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నుస్రత్ జహాన్‌కు మరో ఫత్వా తప్పదా..? ఇస్కాన్ రథయాత్రకు టీఎంసీ ఎంపీ!! కుల, మతాలకు తావులేదని వ్యాఖ్య

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా : భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం. విభిన్న మతాలు, ఆచారాలు, సాంప్రదాయాలకు నెలవు. అందుకే భారతదేశాన్ని ఉప ఖండం అని కూడా పిలుస్తారు. ఈ క్రమంలోనే టీఎంసీ ఎంపీ, ప్రముఖ నటి నుస్రాత్ జహన్ .. ఓ భారతీయ మహిళలాగా ఆచార వ్యవహరాలు పాటిస్తారు. తాను ఓ వ్యాపారస్తుడిని పెళ్లిచేసుకున్న .. నుదుట కుంకుమ, మెడలో మాంగళ్యం ధరించి .. అచ్చమైన హిందువు మహిళగా కనిపిస్తుంటారు.

భిన్నత్వంలో ఏకత్వం ..

భిన్నత్వంలో ఏకత్వం ..

నుస్రత్ జహన్ .. పేరు పలుకకుంటే ఆమె హిందువేనని అనుకుంటారు. అయితే ఆమె ఆలయాలు, పుణ్య కార్యక్రమాలకు హాజరవుతారు. అయితే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్‌సియస్‌నెస్ (ఇస్కాన్) రథయాత్రకు హాజరవడమే విశేషం. కోల్‌కతాలో గురువారం చేపట్టే రథయాత్రకు నుస్రత్ హాజరుకానున్నారు. ఈ మేరకు ఇస్కాన్ వర్గాలు ధ్రువీకరించారు. నుస్రత్ .. భారతదేశ మహిళ అని.. ఇస్కాన్ అధికార ప్రతినిధి రాధారామన్ దాస్ పేర్కొన్నారు. ఇస్కాన్ ప్రారంభించి .. 48 ఏళ్లు అవుతున్నందున కోల్‌కతాలో ర్యాలీ తీస్తున్నారు.

హిందు సాంప్రదాయమే ..

హిందు సాంప్రదాయమే ..

యాక్టర్ కమ్ పొలిటిషీయన్ నుస్రత్ జహన్ కోల్‌కతాకు చెందిన వ్యాపారవేత్తను పెళ్లిచేసుకుంది. అయితే ఆమె నుదుట కుంకుమ, మెడలో మాంగళ్యం ధరిస్తారు. లోక్‌సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేప్పుడు కూడా హిందు యువతిలాగా రావడంపై విమర్శలు వచ్చాయి. అయితే తాను భారతీయ మహిళ అని .. తనకు కులం, మతం, ప్రాంతం వర్తించదని స్పష్టంచేశారు నుజ్రత్. అంతేకాదు తన భర్తతోపాటు ఇస్కాన్ రథయాత్రలో పాల్గొంటారని పేర్కొన్నారు. వీరితోపాటు సినీనటులు కూడా కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు.

సమాన గౌరవం ..

సమాన గౌరవం ..

నవ భారత ప్రతినిధి నుస్రత్ జహన్. ఆమె ఇతర మతాలను విశ్వసిస్తారు. వారి పండుగల్లో పాల్గొంటారని .. దీంతో భారతదేశం గొప్ప కంట్రీగా అవతరిస్తోందని ఇస్కాన్ అధికార ప్రతినిధి దాస్ పేర్కొన్నారు. నవ భారత యువత నుస్రత్ లాగా ఆలోచిస్తున్నారని .. వారికి స్వేచ్చనిచ్చి, బాధ్యత తెలిసేలా మసులుకోవాలని సూచిస్తే ఆ విధంగా వ్యవహరిస్తున్నారని గుర్తుచేశారు. అయితే వారికి స్వేచ్చ, స్వాతంత్రాలు ఇచ్చింది మాత్రం ఆ భగవంతుడని స్పష్టంచేశారు. ఇదివరకు నుస్రత్ కూడా ఇస్కాన్ ప్రతినిధుల ఆహ్వానానికి ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. రథయాత్రలో పాల్గొనాలని పిలుపునివ్వడాన్ని ఆమె స్వాగతించారు. అంతేకాదు ఇస్కాన్ రథయాత్రలో ముస్లింలు పాల్గొనడం హర్షణీయమని గుర్తుచేశారు.

English summary
newly elected TMC MP and actor Nusrat Jahan whose stand on religion and inclusiveness is "in sync" with the ISKCON's spirit of "social harmony", has been invited as a special guest at the inauguration ceremony of the Kolkata ISKCON Rathayatra on Thursday. Thanking Nusrat Jahan for accepting the invitation, ISKCON spokesperson Radharaman Das said, the actor represented an "all inclusive India" and was "really showing the road forward". The 48th edition of the Rathayatra organised by the International Society for Krishna Consciousness (ISKCON) since 1971, will be inaugurated by West Bengal Chief Minister Mamata Banerjee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X