వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నదిలో శవమైన ఇస్కాన్ టెంపుల్ అర్చకుడు

|
Google Oneindia TeluguNews

మంగళూరు: ఇస్కాన్ దేవాలయం అర్చకుడు అనుమానాస్పద స్థితిలో నదిలో శవమై కనిపించాడు. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్చకుడి మృతదేహానికి ఉన్న బ్యాగ్ లో పెద్ద రాయి ఉండటంతో పోలీసులు పలు కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.

బెంగళూరులోని ఇస్కాన్ దేవాలయం సిబ్బంది రాఘవ గోవిందదాస్ (28) అనే ఆయన అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. ఈయన మంగళూరులోని ఇస్కాన్ దేవాలయంలో అర్చకుడిగా పని చేస్తున్నాడు. ఆదివారం అడంకుద్ర సమీపంలోని నేత్రావతి నది దగ్గరకు వెళ్లాడు.

ISKCON priest Ragav Govindadas found dead in Mangalore

తరువాత రాఘవ గోవిందదాస్ ఆచూకి లేదు. సాయంత్రం నేత్రావతి నదిలో శవం తేలుతున్న విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నదిలో నుండి మృతదేహాన్ని బయటకు తీశారు. వివరాలు సేకరించగా అతను రాఘవ గోవిందదాస్ అని తెలిసింది.

రాఘవను హత్య చేసి అతని వీపుకు పెద్ద రాయి ఉన్న బ్యాగ్ తగిలించి నదిలోకి విసిరివేశారని అతని అన్న నరేంద్ర కామత్ ఉళ్లాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రాఘవ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా, హత్యకు గురైనాడా అని పూర్తి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
28-year-old ISKCON priest Ragav Govindadas found dead in Mangalore. Bengalore based Ragav working in Mangaluru ISKCON. Body found in Netravati river on Sunday. Ullal police registered the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X