వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో ఐఎస్ ఉగ్రవాది అబు యూసుఫ్ అరెస్ట్, 15 కేజీల ఐఈడీ స్వాధీనం

|
Google Oneindia TeluguNews

వినాయక చవితి పండగ రోజు దేశ రాజధాని ఢిల్లీలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది పట్టుబడ్డాడు. అతని వద్ద భారీగా పేలుడు పదార్ధం ఉండటంతో ఆందోళన కలిగిస్తోంది. ఉగ్రవాదితో కాల్పులు జరిగిన తర్వాత అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి అతన్ని అదుపులోకి తీసుకున్నామని వివరించారు.

ఐఎస్ ఉగ్రవాది అబు యూసుఫ్‌గా గుర్తించారు. ఢిల్లీలో ప్రముఖ వ్యక్తిని హతం చేసేందుకు వచ్చాడని తెలిసింది. అతని వద్ద గల ప్రెషర్ కుక్కర్ల నుంచి 15 కిలోల ఐఈడీ పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత వాటిని దౌలా కువాన్ వద్దకు తీసుకెళ్లి బాండ్ స్వ్కాడ్ సిబ్బంది నిర్వీర్యం చేశారు.

Islamic State terrorist arrested in Delhi, 15 kg IED seize..

Recommended Video

COVID-19 Cases Cross 1 Lakh Mark In Telangana తెలంగాణ గ్రేటర్ పరిధిలో మళ్లీ పెరుగుతున్న కేసులు!!

ఢిల్లీలో కొందరితో కలిసి అబు యూసుఫ్ పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతని సానుభూతిపరుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అబు యూసుఫ్ ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ అని.. అక్కడ కూడా గాలింపు చర్యలను చేపట్టామని వివరించారు. ఘటన స్థలానికి డాగ్ స్వ్కాడ్ చేరుకొని.. ఇతర పేలుడు పదార్థాలు ఉన్నాయేమో అని పరిశీలిస్తోంది. ఢిల్లీలో పెద్ద దాడి చేసేందుకు కుట్ర పన్నారని ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ ప్రమోద్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో పలుచోట్ల రెక్కీ నిర్వహించినట్టు ఆయన తెలిపారు.

English summary
Islamic State terrorist has been arrested in Delhi after a brief exchange of fire in the heart of the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X