వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొరపాటైంది, క్షమించండి: భారతీయులకు ఇజ్రాయెల్ ప్రధాని కుమారుడు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/జెరూసలేం: హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఓ ట్వీట్ చేసిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ కుమారుడు యేర్.. ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని భారతీయులకు క్షమాపణలు చెప్పారు. తెలియకుండా జరిగిన పొరపాటని అన్నారు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే 29ఏళ్ల యేర్.. ఇజ్రాయెల్ దేశంలో రాజకీయ పరిణామాలకు సరిపోతుందని తలచి ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. తన తండ్రి అవినీతి కేసులలో ప్రాసిక్యూటర్ అయిన లియాట్ బెన్ అరి ముఖంతో హిందూ దేవత యొక్క చిత్రాన్ని పోస్టు చేశాడు. అనేక చేతులుండగా.. మధ్య వేలును పొడుగు చేశారు.

Israeli PM Netanyahu’s son apologises after his tweet offends Indians

'నేను సెటైరికల్‌ పేజీలో ఉన్న ఓ మీమ్‌ను తీసుకుని ఇజ్రాయెల్ రాజకీయలకు సరిపోతుందని పోస్టు చేశా. ఇది హిందూ దేవీదేవతలకు సంబంధించినదని నాకు తెలియదు. పలువురు భారతీయ స్నేహితులు కామెంట్లు పెట్టారు. వెంటనే విషయం తెలుసుకుని ఆ ట్వీట్‌ను డిలీట్ చేశా. ఈ పరిణామానికి క్షమాపణలు చెబుతున్నా' అని యేర్ మరో ట్వీట్ చేశారు.

నీచమైన వ్యక్తుల మీ స్థలాన్ని తెలుసుకోండి అంటూ అటార్నీ జనరల్ అవిచ్చా మండెల్బిట్స్ ముఖాన్ని దేవత వద్ద ఉన్న పులి ముఖానికి పెట్టి ఆ పోస్టు చేశారు.
ఈ ట్వీట్ పై భిన్న వాదనలు వచ్చాయి. అయితే, భారతీయుల నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చాయి. తాము ఆరాధించే దేవీదేవతలను ఇలా చూపించడంపై మండిపడ్డారు.

ట్వీట్ డిలీట్ చేసి క్షమాపణలు చెప్పిన యేర్‌ను పలువురు ఇజ్రాయేలీలు అతడ్ని అభినందించారు. మరికొందరు బాధ్యత లేకుండా అలాంటి ట్వీట్లు ఎందుకు చేయాలంటూ విమర్శించారు. అవినీతి కేసులో నెతన్యాహూ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో యేర్ చేసిన ట్వీట్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.

English summary
Israeli Prime Minister Benjamin Netanyahu’s eldest son Yair has apologised to Hindus after he faced flak from some Indians who found one of his tweets to be “quite offensive”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X