వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఇజ్రాయిల్ బాంబులు...బాలాకోట్ దాడులకు వీటినే వాడారట..!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇజ్రాయిల్ నుంచి స్పైస్-2000 బాంబులు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరాయి.దీంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైర్ పవర్ బలోపేతం అయ్యింది. బాలాకోట్‌లో దాడులు చేసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వినియోగించింది ఈ స్పైస్ -2000 బాంబుెలు కావడం విశేషం. పుల్వామా దాడులకు ప్రతీకార చర్యలో భాగంగా భారత్ బాలాకోట్ దాడులు నిర్వహించింది. ఆ సమయంలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన స్థావరాలపై భారత్ ఈ బాంబులను జారవిడిచింది.

ఈ ఏడాది జూన్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పెస్ బాంబుల కోసం ఇజ్రాయిల్‌తో రూ. 300 కోట్లకు ఒప్పందం చేసుకుంది. మొత్తం 100 బాంబులను సప్లై చేయాల్సిందిగా డీల్ కుదుర్చుకుంది. ఈ బాంబులు ఒక్కసారి పై నుంచి జారవిడిస్తే ఒక భవంతి లోపలికి చొచ్చుకుపోయి ఆ తర్వాత భూమిని తాకి విస్ఫోటనం చెందుతాయని అధికారులు వెల్లడించారు.

Israeli SPICE bombs used in Balakot airstrikes arrive in India

బాలాకోట్‌లో ఈ స్పైస్ -2000 వర్షన్ బాంబులను ప్రయోగించి సక్సెస్ కావడంతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దీనికి మించిన అడ్వాన్స్ బాంబులు మార్క్ 84 కోసం ఇజ్రాయిల్‌కు ఆర్డర్ ఇచ్చింది. ఈ బాంబులు భవంతులను, బంకర్లను పూర్తిగా ధ్వంసం చేయగలే శక్తి ఉంటుంది. ఇక మార్క్ 84 వార్‌హెడ్లు మరో రెండు వారాల్లో భారత్‌కు చేరుకుంటాయని తెలుస్తోంది. ఇప్పటికే భారత్ పాక్ మధ్య యుద్ధవాతావరణం నెలకొనడంతో ఈ తరహా బాంబులు భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. అంతేకాదు త్వరలో యాంటీ రేడియేషన్ క్షిపణలు కూడా భారత రక్షణ వ్యవస్థలో చేరనున్నాయి.

English summary
In a major boost for the firepower of the Indian Air Force, three batches of the Israeli SPICE-2000 bombs arrived on Saturday in India. These are the same bombs that the IAF used during the Balakot airstrikes to target the Jaish facility in the Khyber Pakhtunkhwa province.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X