వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇస్రో ఛైర్మన్ కే శివన్ పదవీ కాలాన్ని పొడిగించిన కేంద్రం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఛైర్మన్ కైలసవాడివో శివన్(కే శివన్) పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ప్రస్తుతం డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ సెక్రటరీ, స్పేస్ కమిషన్ ఛైర్మన్‌‌గా ఉన్న ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపింది.

ఈ నిర్ణయంతో 2022 జనవరి 14 వరకు ఇస్రో అధిపతిగా కే శివన్ కొనసాగేందుకు అవకాశం లభించింది. శివన్ 2018, జనవరి 10న ఇస్రో ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అప్పటి ఛైర్మన్‌గా ఉన్న ఏకే కిరణ్ కుమార్ నుంచి జనవరి 14న బాధ్యతలు స్వీకరించారు.

 Isro chairman K Sivan gets one-year extension

కాగా, శివన్ కాకుండా, మరో ఇద్దరు సీనియర్ శాస్త్రవేత్తలు, వి.ఎస్.ఎస్.సి డైరెక్టర్ ఎస్ సోమనాథ్, యుఆర్ఎస్ఐసి డైరెక్టర్ కున్హికృష్ణన్ అత్యున్నత స్థాయిలో ఉన్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు నివేదించినట్లుగా.. వీరిద్దరితోపాటు మరొక సీనియర్ శాస్త్రవేత్త... కొత్తగా ఏర్పడిన అంతరిక్ష నియంత్రకం IN-SPACe చైర్మన్ పదవికి సిఫారసు చేయబడ్డారు. IN-SPACe పనిచేసే అంతరిక్ష విభాగం, దాని ఛైర్మన్ నియామకంపై కేంద్రం, పీఎంవో నుంచి వచ్చే నిర్ణయం కోసం వేచి ఉంది.

English summary
The appointments committee of the Union cabinet on Wednesday approved giving an extension of one year to Isro chairman K Sivan, who was due superannuation on January 14, 2021.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X