వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రయాన్ - 2 విజయంతో ఇస్రోకు అభినందనలు.. చందమామతో అందంగా సైకత శిల్పం

|
Google Oneindia TeluguNews

పూరీ : భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అంతరిక్షంలోకి ప్రవేశపెట్టినప్పటి నుంచి భూ కక్ష్యలో పరిభ్రమించిన విక్రమ్ స్పేస్ క్రాఫ్ట్ విజయవంతంగా మంగళవారం నాడు చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. భారతకాలమాన ప్రకారం ఉదయం 9 గంటల 2 నిమిషాలకు చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్‌ను చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగంలో ఇదే అత్యంత క్లిష్టమైన దశగా అభివర్ణించింది.

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ - 2 ప్రయోగ దశలో మంగళవారం నాడు అత్యంత కీలక ఘట్టం సక్సెస్ అయింది. జులై 22వ తేదీన నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3ఎం1 ద్వారా చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. సరిగ్గా నెల రోజుల తర్వాత భూకక్ష్య నుంచి చంద్రుని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు.

<strong>చందాలు బందే.. బలవంతంగా వసూలు చేస్తే అంతే.. పోలీసుల హెచ్చరిక..!</strong>చందాలు బందే.. బలవంతంగా వసూలు చేస్తే అంతే.. పోలీసుల హెచ్చరిక..!

isro congratulated with superb sculpture in puri odisha

చంద్రయాన్ - 2 కు సంబంధించి అత్యంత కీలక ఘట్టం విజయవంతం కావడంతో దేశమంతటా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి వినూత్నంగా అభినందనలు తెలిపారు. ఒడిషాలోని పూరీ తీరంలో సైకత శిల్పం అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇసుక తిన్నెలపై జాబిల్లి వాలిందా అన్నట్లుగా సందర్శకులను ఆకట్టుకుంటోంది. చంద్రుడి వైపు ఎక్కుపెట్టినట్లుగా చంద్రయాన్ - 2 ఉపగ్రహం ఔరా అనిపిస్తోంది. "చంద్రయాన్ 2, ఇండియాస్ మిషన్ టు మూన్, జయహో అంటూ ఇంగ్లీష్ అక్షరాలతో తన అభినందనలు తెలియజేశారు పట్నాయక్.

English summary
With the success of Chandrayaan-2, the most important event of the year has been raging all over the country. The sculptor Sudarshan Patnaik congratulated the ISRO team on the occasion. Sculpture on the Puri coast of Odisha is magnificent. The Moon on the sand dunes is as impressive as the visitors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X