• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Gaganyaan: ముగిసిన మరో కీలక అధ్యాయం: రష్యాలో ఏడాది పాటు భారత ఆస్ట్రోనాట్స్

|

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ మిషన్‌లో మరో కీలక ముందడుగు పడింది. మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి ఉద్దేశించిన ఈ మిషన్‌లో మరో అంకం ముగిసింది. ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపికైన వ్యోమగాములు తమ శిక్షణ పూర్తి చేసుకున్నారు. రష్యాలో ఏడాది కాలం పాటు వారి శిక్షణ కొనసాగింది. 365 రోజుల పాటు కొనసాగిన వారి ఆస్ట్రోనాట్స్ ట్రైనింగ్ పూర్తయినట్లు రష్యా ప్రకటించింది.

  #GaganyaanMission: Indian Astronauts Complete Training In Russia గగన్‌యాన్ మిషన్‌లో మరో ముందడుగు...!
  ట్రైనింగ్ ముగిసినట్లు వెల్లడించిన డీజీ

  ట్రైనింగ్ ముగిసినట్లు వెల్లడించిన డీజీ


  ఆర్బిటల్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించే ఈ మిషన్‌ను ఇస్రో వచ్చే ఏడాది చేపట్టనుంది. మాస్కో సమీపంలోని జైయోజ్డ్నీ గొరొడోక్ సిటీలో గల రష్యాన్ స్పేస్ సెంటర్‌లో భారతీయ ఆస్ట్రోనాట్స్‌కు శిక్షణ ఇచ్చారు. వారి శిక్షణకాలం ముగిసినట్లు డైరెక్టర్ జనరల్ దిమిత్రి రొగోజిన్ తెలిపారు. రష్యా న్యూస్ ఏజెన్సీ స్పుత్నిక్‌కు చెందిన టెలిగ్రామ్ ఛానల్‌ ఈ మేరకు ఓ కథనాన్ని ప్రసారం చేసింది. సాయంత్రమే తాను భారతీయ వ్యోమగాములను కలుసుకున్నానని, వారి శిక్షణకాలం ముగిసినట్లు తెలిపానని చెప్పారు.

  2019లో రష్యాతో ఒప్పందం..

  2019లో రష్యాతో ఒప్పందం..


  రష్యాలోని భారత రాయబార కార్యాలయానికి కూడా ఈ సమాచారాన్ని చేరవేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్‌లో భారత్‌తో కలిసి మరిన్ని అంతరిక్ష ప్రయోగాలు, మిషన్లను చేపట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. భారత వ్యోమగాములకు అవతసరమైన శిక్షణను ఇవ్వడానికి ఇస్రో, రష్యాకు చెందిన లాచ్ సర్వీస్ ప్రొవైడర్ గ్లావ్‌కోస్మోస్‌ మధ్య 2019 జూన్‌లో ఓ ఒప్పందం కుదిరింది. అంతరిక్షంలోకి వెళ్లడానికి నలుగురు వైమానిక దళానికి చెందిన పైలెట్లను ఇస్రో ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

  కోవిడ్ అవాంతరాలొచ్చినా..

  కోవిడ్ అవాంతరాలొచ్చినా..

  వారిలో ఒకరు గ్రూప్ కేప్టెన్, ముగ్గురు వింగ్ కమాండర్‌లు ఉన్నారు. గత ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన ఈ శిక్షణ ప్రారంభమైంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న కాలంలో విధించిన లాక్‌డౌన్ వల్ల శిక్షణకాలం మధ్యలో కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ- అంతరిక్ష శిక్షణను వారు విజయవంతంగా ముగించుకున్నారు. స్వదేశానికి వచ్చిన తరువాత వారికి మరో దశకు సంబంధించిన శిక్షణను తీసుకోవాల్సి ఉంటుంది. మాడ్యుల్ స్పెసిఫిక్ శిక్షణలో వారు పాల్గొనాల్సి ఉంటుంది.

  రూ. 10 వేల కోట్లు

  రూ. 10 వేల కోట్లు

  ఈ మాడ్యుల్‌ను ఇస్రో తన స్వీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. మానవ సహిత అంతరిక్ష పరిశోధనను సాగించడానికి ఇస్రో చేపట్టిన గగన్‌యాన్ మిషన్ కోసం కేంద్ర ప్రభుత్వం 10 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. 2022లో ఇస్రో ఈ మిషన్‌ను చేపట్టనుంది. మానవ సహిత అంతరిక్ష ప్రయోగాన్ని ఎప్పుడు ప్రారంభించాలనే తేదీని ఇంకా ఖరారు చేయలేదు. ఇలాంటి ప్రాజెక్ట్‌ను ఇస్రో చేపట్టడం ఇదే తొలిసారి. ఫలితంగా- దేశవ్యాప్తంగా మిషన్ గగన్‌యాన్ పట్ల ఆసక్తి నెలకంది.

  English summary
  Indian astronaut candidates for Gaganyaan mission, selected to become astronauts to crew the Gaganyaan into orbit, have completed their one-year training course in Russia's Zvyozdny gorodok city near Moscow.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X