నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ISRO: శ్రీహరికోటకు ఇస్రో గుడ్ బై చెబుతుందా? తమిళనాడులో మరో ప్రయోగ కేంద్రం..!

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: శ్రీహరికోట. ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో ఉన్న ఏకైక అంతరిక్ష ప్రయోగ కేంద్రం. మన రాష్ట్రానికే తలమానికం. భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ (ఇస్రో) విజయాలకు కేరాఫ్ అడ్రస్. ఇస్రో ఓ రాకెట్ ను అంతరిక్షంలోకి ప్రయోగిస్తోదంటే..జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అందరి కళ్లూ శ్రీహరికోట మీదే నిలుస్తాయి. దీని గురించి ఆరా తీస్తాయి. శ్రీహరికోటకు గానీ, అక్కడున్న సతీష్ ధవన్ ప్రయోగ కేంద్రానికి గానీ ఉన్న పేరు అలాంటింది.

 శ్రీహరికోటకు ప్రత్యామ్నాయమేనా?

శ్రీహరికోటకు ప్రత్యామ్నాయమేనా?

అలాంటి ప్రతిష్ఠాత్మక శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగానికి ఇస్రో గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే- శ్రీహరికోటకు ప్రత్యామ్నాయంగా మరో ప్రయోగ కేంద్రాన్ని నిర్మించడానికి ఇస్రో సన్నాహాలు చేపట్టింది కూడా. ప్రస్తుతం ఇస్రో పరిధిలో ఉన్న ఏకైక ప్రయోగ కేంద్రం ఇదే కావడం వల్ల దీనిపై ఒత్తిడి అధికంగా ఉంటోందనే అభిప్రాయం కొద్దిరోజుల నుంచీ ఇస్రో శాస్త్రవేత్తల్లో వ్యక్తమౌతూ వస్తోంది. ఈ కారణం వల్లే దీనికి ప్రత్యామ్నాయంగా మరో కేంద్రాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది.

గగన్ యాన్ ప్రాజెక్టు నాటికి..

గగన్ యాన్ ప్రాజెక్టు నాటికి..

ప్రస్తుతం స్థల సేకరణ దశలో ఉంది ఈ ప్రాజెక్టు. తూత్తుకుడి సముద్ర తీరం వద్ద స్థలాన్ని సేకరిస్తోంది. స్థల సేకరణ పూర్తి చేసుకుని, నిర్మాణ పనులకు శంకుస్థాపన పడినప్పటి నుంచీ ఏడాదిన్నర కాల వ్యవధిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. గగన్ యాన్ ప్రాజెక్టు నాటికి తూత్తుకుడి వద్ద కొత్త ప్రయోగ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకుని వస్తారని అంటున్నారు. గగన్ యాన్ ను అక్కడి నుంచే ప్రయోగించవచ్చని చెబుతున్నారు.

ఓడరేవు కావడం వల్లే..

ఓడరేవు కావడం వల్లే..

తూత్తుకుడి ఓడరేవు నగరం. వీఓ చిదంబరం ఓడరేవు అక్కడ కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఓడరేవు నగరం కావడం వల్లే రెండో ప్రయోగ కేంద్రం నిర్మాణానికి ఇస్రో తూత్తుకుడిని ఎంపిక చేశారని అంటున్నారు. శ్రీహరికోటకు ఆ వసతి లేదు. శ్రీహరికోటకు సమీపంలో ఉన్న ఓడరేవు ప్రాంతం కృష్ణపట్నం లేదా చెన్నై. ప్రస్తుతం ఇస్రో.. వాణిజ్యపరమైన విదేశీ ఉపగ్రహాలను పెద్ద ఎత్తున అంతరిక్షానికి చేరవేస్తోన్న విషయం తెలిసిందే. గత ఏడాది సుమారు పలు విదేశీ కమర్షియల్ ఉపగ్రహాలను ప్రయోగించింది.

 విదేశీ కమర్షియల్ శాటిలైట్ల కోసం

విదేశీ కమర్షియల్ శాటిలైట్ల కోసం

వాటన్నింటినీ నౌకల ద్వారానే శ్రీహరికోటకు చేర్చారు. తొలుత చెన్నై, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో షార్ సెంటర్ కు తీసుకొచ్చారు. ఈ ఇబ్బందిని అధిగమించాలనే ఉద్దేశంతోనే తూత్తుకుడి వద్ద రెండో ప్రయోగ కేంద్రాన్ని నిర్మించడానికి ఇస్రో సన్నాహాలు చేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. తూత్తుకుడి వద్ద ఇప్పటికే నౌకాశ్రయం ఉండటం వల్ల నేరుగా ఆయా విదేశీ కమర్షియల్ శాటిలైట్లను ప్రయోగ కేంద్రానికి చేర్చడానికి వీలు ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.

English summary
The land acquisition for a second space port has been initiated and the port will be in Thoothukudi, Tamil Nadu. ISRO is looking alternative for Satish Dhavan Space centre (SHAR) in Sriharikota in Nellore district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X