వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో అద్భుతం: ఒకేసారి 83ఉపగ్రహాలను ప్రయోగించనున్న ఇస్రో

జనవరిలో ఒకేసారి 83 ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు మంగళవారం ఇస్రో వెల్లడించింది.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: నూతన సంవత్సర ఆరంభంలోనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అద్భుతాన్ని ఆవిష్కరించనుంది. జనవరిలో ఒకేసారి 83 ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు మంగళవారం వెల్లడించింది. తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ జనవరి నెల చివరి వారంలో ఉండవచ్చని భావిస్తున్నారు.

ఈ ప్రయోగానికి ఉపగ్రహ వాహన నౌక పీఎస్ఎల్‌వీ-37ను ఉపయోగించనున్నామని ఇస్రో చైర్మన్ ఎఎస్ కిరణ్ కుమార్ బెంగళూరులో తెలిపారు. 83 ఉపగ్రహాల్లో 80 ఇజ్రాయిల్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా తదితర దేశాలకు చెందినవి. వీటి బరువు 500 కేజీలు. మూడు మాత్రమే మన దేశ ఉపగ్రహాలున్నాయి.

ISRO to launch record 83 satellites in one go in Jan

ఇవి కార్టోశాట్‌ 2 సిరీస్ 730 కేజీలు, ఐఎన్‌ఎస్ ఐఏ, ఐఎన్ఎస్ 1బి రెండింటి బరువు కలిపి 30 కేజీలు. ఈ ఏడాది జూన్‌లో ఇస్రో రికార్డు స‌ృష్టిస్తూ శ్రీహరికోట నుంచి ఒకేసారి 20 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

అంతకుముందు 2008లో ఒకేసారి 10 ఉపగ్రహాలను ప్రయోగించింది. వచ్చే ఏడాది అయిదు సమాచార ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యమని ఇస్రో చైర్మన్ చెప్పారు. కాగా, ఇప్పటికే అనేక విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఇస్రో.. ఒకేసారి 83ఉపగ్రహాలను పంపి మరో ఘనత సాధించనుంది.

English summary
ISRO today said it would launch a record 83 satellites in one go using its workhorse PSLV-C37 toward the end of January.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X