వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్టోశాట్-3 ప్రయోగం వాయిదా: 13 నానో ఉపగ్రహాలను మోసుకెళ్లడంలో జాప్యం..!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కార్టోశాట్-3 ప్రయోగం వాయిదా పడింది. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) అంతరిక్షంలోకి ప్రయోగించనున్న ఈ ప్రాజెక్టును సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేసింది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ కే శివన్ వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 25కు బదులుగా 27వ తేదీన ప్రయోగించినున్నట్లు తెలిపారు. 27వ తేదీన ఉదయం 9:28 నిమిషాలకు కార్టోశాట్-3ని ప్రయోగించనున్నట్లు వెల్లడించారు.

ఏడాది కిందటే ప్రేమ వివాహం: మృతదేహమై కనిపించిన మహిళా డాక్టర్..!ఏడాది కిందటే ప్రేమ వివాహం: మృతదేహమై కనిపించిన మహిళా డాక్టర్..!

ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారుం.. కార్టోశాట్-3ని 25వ తేదీన ఉదయం 9:28 నిమిషాలు ప్రయోగించాల్సి ఉంది. ఈ ప్రయోగం సందర్భంగా దేశీయంగా రూపొందించిన ఓ ఉప్రగహంతో పాటు అమెరికాకు చెందిన 13 నానో శాటిలైట్లను ఇస్రో అంతరిక్షంలో ప్రయోగించాల్సి ఉంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం రెండో లాంచ్ ప్యాడ్ నుంచి కార్టోశాట్-3ని పంపించాల్సి ఉంది. సాంకేతిక కారణాల వల్ల దీన్ని 27వ తేదీన ఉదయం 9:28 నిమిషాలకు ప్రయోగించనున్నట్లు కే శివన్ వెల్లడించారు.

Isro postpones launch of Cartosat-3 along with the 13 US satellites to Nov 27

కార్టోశాట్ -3 ఉపగ్రహం థర్డ్ జనరేషన్ కు చెందిన అడ్వాన్స్‌డ్‌ శాటిలైట్. హై రిజల్యూషన్ ఇమేజింగ్ దీని సొంతం. అంతకుముందు ప్రయోగించిన కార్టోశాట్లలతో పోల్చుకుంటే అత్యాధునిక పరికరాలను ఇందులో అమర్చారు. ఉగ్రవాదుల కార్యకలాపాలు వారి శిబిరాలను సైతం పసిగట్టడానికి ఈ ప్రయోగం ఉపకరిస్తుందని అంటున్నారు. మిలటరీ నిఘా కార్యక్రమాలకు ఈ ఉపగ్రహం ఎక్కువగా దోహదపడుతుంది.

కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని 97.5 డిగ్రీల వంపులో 509 కిలోమీటర్ల కక్ష్యలో ప్రవేశపెడతారు. ఇక ఇస్రో చెబుతున్న ప్రకారం అమెరికాకు చెందిన 13 నానో శాటిలైట్లను కూడా నింగిలోకి పంపనున్నారు. స్పేస్ డిపార్ట్‌మెంట్ కింద కొత్తగా ఏర్పడిన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఈ నానో శాటిలైట్లను రూపొందించింది. దీనితోపాటు అమెరికాకు చెందిన 13 నానో శాటిలైట్లను అంతరిక్షంలోనికి మోసుకెళ్లడం ఇదే తొలిసారి అవుతుంది.

English summary
The Indian space agency on Thursday said it has postponed the launch of Catosat-3 satellite and 13 commercial nanosatellites with its PSLV rocket by two days to Nov 27. According to Indian Space Research Organisation (ISRO), the launch of PSLV-XL variant carrying Cartosat-3 and 13 US nano satellites has been rescheduled for November 27 at 9.28 a.m.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X