వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టువదలని విక్రమార్కుడిలా: విక్రమ్ ల్యాండర్ కాంటాక్ట్ కోసం ఇస్రో ప్రయత్నం

|
Google Oneindia TeluguNews

చంద్రుడిపైకి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 మిషన్ చివరి నిమిషంలో విక్రమ్ ల్యాండర్ గాడి తప్పడంతో నిరాశ కలిగించింది. అయితే విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు తెగిపోవడంతో దాని జాడను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. అయితే ఆర్బిటార్‌ ల్యాండర్ జాడను గుర్తించింది. ఇక అప్పటి నుంచి విక్రమ్‌తో సంబంధాలు పునరుద్ధరించేందుకు సెప్టెంబర్ 21వరకు గడువు ఉన్నింది. కానీ ఆ గడువులోగా అది జరగలేదు. ఇప్పటికే మూడు వారాలు గడిచిపోయాయి. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా ఇస్రో మళ్లీ విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

విక్రమ్ ల్యాండర్ ఫొటోలు ఇవిగో: చంద్రుడి ఉపరితలాన్ని జల్లెడ పట్టిన నాసా: అయినా నిరాశే!విక్రమ్ ల్యాండర్ ఫొటోలు ఇవిగో: చంద్రుడి ఉపరితలాన్ని జల్లెడ పట్టిన నాసా: అయినా నిరాశే!

 చంద్రుడిపై నెలకొన్న చీకటి

చంద్రుడిపై నెలకొన్న చీకటి

సెప్టెంబర్ 7వ తేదీన ఇస్రో గ్రౌండ్ స్టేషన్‌కు విక్రమ్ ల్యాండర్‌కు మధ్య సమాచార సంబంధాలు కోల్పోయాయి. మరికొద్ది క్షణాల్లో ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది అనగా గాడి తప్పింది. ప్రస్తుతం చంద్రుడిపై చీకటి అలుముకుంది. 10 రోజుల క్రితం అయితే చంద్రుడిపై సూర్యుడి కిరణాలు పడేవి. దీంతో ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణకై ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు పూర్తిగా చీకటి నెలకొనడంతో ఆ ప్రయత్నాలకు కాస్త బ్రేక్ పడింది. అయితే మళ్లీ ల్యాండర్‌తో సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేస్తామని ఇస్రో ఛైర్మెన్ డాక్టర్ శివన్ చెప్పారు.

 వెలుతురు రాగానే ప్రయత్నాలు ప్రారంభిస్తాం

వెలుతురు రాగానే ప్రయత్నాలు ప్రారంభిస్తాం

చంద్రమండలంపై వెలుతురు రాగానే తమ ప్రయత్నాలను ప్రారంభిస్తామని శివన్ చెప్పారు. ఇన్ని రోజుల తర్వాత ల్యాండర్, గ్రౌండ్ స్టేషన్‌ల మధ్య కమ్యూనికేషన్‌ను పునరుద్ధరించడం కష్టమే అయినప్పటికీ ప్రయత్నించడంలో తప్పులేదని డాక్టర్ శివన్ అన్నారు. అయితే రాత్రిసమయాల్లో చంద్రుడిపై అత్యంత చల్లగా ఉంటుండగా ఆ వాతావరణంను ల్యాండర్ తట్టుకోగలదా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు ఇస్రో ప్రతినిధి. అక్కడ వాతావరణమే కాదు, ల్యాండర్ అత్యంత వేగంగా ల్యాండ్ అవడం కూడా తమకు సవాలుగా మారిందని చెప్పారు. హార్డ్ ల్యాండింగ్ వల్ల ల్యాండర్‌లోని చాలా పరికరాలు ధ్వంసం అయి ఉంటాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

హార్డ్ ల్యాండింగ్‌తో యాంటెన్నా దెబ్బతినే అవకాశముంది

హార్డ్ ల్యాండింగ్‌తో యాంటెన్నా దెబ్బతినే అవకాశముంది

హార్డ్ ల్యాండిగ్‌తో ల్యాండర్‌లోని కమ్యూనికేషన్ యాంటెన్నా దెబ్బతిని ఉంటుందని, అందుకే కాంటాక్ట్‌లోకి రావడం కష్టతరంగా మారిందని ఇస్రో ప్రతినిధి చెప్పారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆర్బిటార్ అనుకున్న కక్ష్యలో ప్రవేశపెట్టగలిగామని డాక్టర్ శివన్ చెప్పారు. ఆర్బిటార్ చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ దానిపై ఉన్న నీటి ఆనవాలను, ఖనిజాలను స్టడీ చేస్తుందని చెప్పారు. ఆర్బిటార్‌లోని కెమెరా అత్యంత హై రెజెల్యూషన్ ఉన్న కెమెరా అని చెప్పిన శివన్.. దాన్నుంచి వచ్చే ఫోటోలు ఆధారంగా చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని వివరించారు. ముందుగా అనుకున్నట్లుగా మిషన్ కాలాన్ని ఏడాదికి పరిమితం చేయకుండా ఏడేళ్లకు పరిమితి చేసినట్లు ఇస్రో స్పష్టం చేసింది.

English summary
The ISRO has not given up efforts to spring Chandrayaan-2’s lander Vikram lying on the lunar surface back to life after a hard-landing more than three weeks ago, senior officials indicated on Tuesday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X