వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు చేదువార్తే: కొత్త ఉద్యోగాలు లేవు, ఇండియాలో టెక్కీల ఉద్యోగ భద్రత కష్టమే

మారిన పరిస్థితుల కారణంగా ఇండియాలో ఐటి ఉద్యోగుల పరిస్థితి మరింత ప్రమాదంలో ఉందని ప్రపంచబ్యాంక్ నివేదిక తెలుపుతోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:ఐ.టి. కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న యువతకు చేదు వార్తే. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితులు ఐటి కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో కొత్త ఉద్యోగుల నియామకం కంటే టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ఐటి కంపెనీలు భావిస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితులు ఐటి కంపెనీ ఉద్యోగులకు షాక్ ఇస్తున్నాయి. వేతనాల పెంపును ఇప్పటికే కొన్ని కంపెనీలు వాయిదా వేశాయి.

కొన్ని ఐటి కంపెనీల్లో ఉద్యోగుల నియామకాన్ని నిలిపివేశాయి. ప్రత్యామ్నాయ మార్గాల వైపుకు దృష్టిని కేంద్రీకరించాయి.దీనికి తోడు ఖర్చును తగ్గించేపనిని చేస్తున్నాయి.

ఐటి కంపెనీల్లో ఉద్యోగాలు వస్తే ఎక్కువ వేతనం దొరికే అవకాశం ఉంది. హయిగా బతికే అవకాశం ఉందని బావించే వారికి మారిన పరిస్థితులు ఇబ్బందులను కల్గిస్తున్నాయి.

టెక్నాలజీని వినియోగించుకొంటూ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకొంటూ

టెక్నాలజీని వినియోగించుకొంటూ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకొంటూ

ఐ.టి. కంపెనీలు టెక్నాలజీని ఉపయోగించుకొంటూ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మారిన పరిస్థితులే ఇందుకు కారణంగా కన్పిస్తున్నాయి. ఐటి కంపెనీల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఆంతగా ఆశాజనకమైన వాతావరణం కన్పించడం లేదు.టెక్నాలజీని ఉపయోగించుకొంటూ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడంతో పాటు, ప్రత్యామ్నాయాలపై ఐటి కంపెనీలు కేంద్రీకరిస్తున్నాయి.

ఇండియాలో ఐ.టి ఉద్యోగుల పరిస్థితి ఆందోళనకరమే

ఇండియాలో ఐ.టి ఉద్యోగుల పరిస్థితి ఆందోళనకరమే

ప్రపంచ వ్యాప్తంగా మారిన పరిస్థితులు ముఖ్యంగా ఇండియాలోని ఐ.టి . కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులకు జీతాలు పెంచి వారికి టెక్నాలజీ పరంగా మరిన్ని బాధ్యతలు అప్పగించాలని టిసిఎస్ , విప్రో, ఇన్పోసిస్ భావిస్తున్నాయని వరల్డ్ బ్యాంక్ నివేదిక తెలిపింది.దీనిలో ఇండియాలో ప్రతి 10 ఐటి ఉద్యోగుల్లో 7 ఉద్యోగుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందని ఆ నివేదిక తెలిపింది.

టెక్నాలజీతో ఐ.టి ఉద్యోగులకు ముప్పు

టెక్నాలజీతో ఐ.టి ఉద్యోగులకు ముప్పు

కొత్త ఉద్యోగుల నియామకాన్ని దాదాపుగా ఐ.టి కంపెనీలు పక్కన పెడుతున్నాయి. ఉన్న ఉద్యోగులకు జీతాలు పెంచే విషయాన్ని కొన్ని కంపెనీల్లో వాయిదాలు వేశారు. మరో వైపు ఆటోమెషీన్ నిర్ణయం మరింత ప్రమాదకరంగా ఐటి ఉద్యోగులకు మారనుందని ఈ నివేదిక చెబుతోంది.ఐటి కంపెనీలు ఆటోమెషీన్ నిర్ణయాన్ని విధానాన్ని అమలు చేస్తే కొత్త వారికి ఉద్యోగాలు దొరకడం కష్టమే.

ప్రత్యామ్నాయాల వైపు కంపెనీల చూపు

ప్రత్యామ్నాయాల వైపు కంపెనీల చూపు

ఐ.టి కంపెనీలు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నాయి. మారిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కంపెనీలు ఈ మేరకు ప్రత్యామ్నాయాన్ని ఎంచుకొంటున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ ఉనికిని నిలుపుకొనే ప్రయత్నాలను చేస్తున్నాయి.

English summary
IT companies banned new recruitments in india .after trump elected as a america president. i.t companies searching for alternatives
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X