వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకుషాక్: ఎంటెక్ తో పాటు, నైపుణ్యం ఉండాలి,లేకపోతే ఇక ఇంటికే

సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు పిడుగులాంటి కబురు ఇది. బీటెక్ తోనే సరిపెట్టుకొని సాప్ట్ వేర్ ఇంజనీర్లుగా సెటిలయ్యేవారికి ఇది షాకింగ్ న్యూసే.కేవలం బిటెక్ డిగ్రీ ఉంటే సరిపోదని ఎంటెక్ తోపాటు, ప్రత్యేక నైపుణ్యాలన

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై:సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు పిడుగులాంటి కబురు ఇది. బీటెక్ తోనే సరిపెట్టుకొని సాప్ట్ వేర్ ఇంజనీర్లుగా సెటిలయ్యేవారికి ఇది షాకింగ్ న్యూసే.కేవలం బిటెక్ డిగ్రీ ఉంటే సరిపోదని ఎంటెక్ తోపాటు, ప్రత్యేక నైపుణ్యాలను కూడ కలిగి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకొన్న మార్పులు సాఫ్ట్ వేర్ రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.టెక్కీలు ఉద్యోగాలు ఎప్పడు పోతాయానే ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత టెక్ రంగంపై మరింత ప్రభావం చూపుతున్నాయి. ఖర్చులను తగ్గించుకొనేందుకుగాను సాఫ్ట్ వేర్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.

మారిన పరిస్థితులతో సాఫ్ట్ వేర్ రంగానికి దిగ్గజాల ఆదాయం ఆవిరైపోతోంది.అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు స్థానికంగా పనిచేసేవారినే నియమించుకోవాలని కంపెనీలు నిర్ణయం తీసుకొన్నాయి.

ప్రత్యేక నైపుణ్యాలుంటేనే ఉద్యోగాలు

ప్రత్యేక నైపుణ్యాలుంటేనే ఉద్యోగాలు

అసలే భారీ ఉద్యోగాల కోత వార్తలతో ఆందోళనలో పడిపోయిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు పిడుగులాంటి వార్త. బీటెక్ తోపాటు సరిపెట్టుకొనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా సెటిలైనవారికి షాకింగే. బీటెక్ డిగ్రీ ఉంటే చాలదు. ఎంటెక్ తో పాటు ప్రత్యేక నైపుణ్యాలను కూడ కలిగి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి యువతకు భవిష్యత్ లో ఐటీ సెక్టార్ లో జాబ్స్ కష్టంగా ఉంటుందని ప్రముఖ టెక్ నిపుణుడు మోహన్ దాస్ పాయ్ చెప్పారు. నైపుణ్యం గల నిపుణులతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని కంపెనీలు కోరుకొంటున్నాయని మణిపాల్ గ్లోబర్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రస్తుత ఛైర్మెన్ పాయ్ చెప్పారు.

స్వంత కోడింగ్ టెక్నాలజీని నేర్చుకోవాలి

స్వంత కోడింగ్ టెక్నాలజీని నేర్చుకోవాలి

ఐటీ సెక్టార్ లో మంచి ఉద్యోగం పొందడానికి బీటెక్ డిగ్రీ సరిపోదని, ఇన్పోసిసి మాజీ హెచ్ ఆర్ హెడ్ మోహన్ దాస్ అభిప్రాయపడ్డారు. ఇందుకు ఎంటెక్ తోపాటు స్పెషలైజేషన్ చేయాలని ఆయన సలహ ఇచ్చారు. కాలేజీ విద్యార్థులంతా ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు. అంతేకాదు అదనపు తరగతుల ద్వారా స్వంత కోడింగ్ టెక్నాలజీని అలవర్చుకోవాలని ఆయన సూచించారు.

ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు కంపెనీలు సిద్దంగా లేవు

ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు కంపెనీలు సిద్దంగా లేవు

ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉద్యోగులకు నిపుణులుగా తీర్చిదిద్దేందుకు కంపెనీలు సిద్దంగా లేవన్నారు. తద్వారా ఆయా కంపెనీలు సమయం, డబ్బు ఎందుకు వృధా చేసుకొంటాయని ఆయన ప్రశ్నించారు. కోడింగ్ లో నైపుణ్యం సాధిస్తేనే కంపెనీలు ఎంపిక చేసుకొంటాయన్నారు.గత రెండు దశాబ్దాలలో ఇన్పర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమలో ప్రెషర్స్ జీతాల గురించి అడిగినప్పుడు ఇది గొప్ప విషాదంగా పాయ్ పేర్కొన్నారు.ఎందుకంటే మొత్తం పరిశ్రమ వృద్ది మందగించిందన్నారు.

ఐటీలో సంక్షోభం లేదు

ఐటీలో సంక్షోభం లేదు

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల సంఖ్య పెరిగింది. కానీ, దానికి తగ్గ డిమాండ్ లేదన్నారు. ఐటీలో గ్లోబల్ వ్యయం ఈ ఏడాది కేవలం రెండు శాతం మాత్రమే పెరగనుందని అంచనావేశారు. అంతకుముందు కూడ ఇది ప్రభావం చూపిస్తోందన్నారు. అలాగే ఐటీ ఉద్యోగాల సంక్షోభవార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఐటీ పరిశ్రమలో విస్తృత ఉద్యోగ నష్టాలను సూచించే నివేదికలన్నీ అతిశయోశక్తులను కొట్టిపారేశారు. దీనకి డేటాను పరిశీలించాలన్నారు. ఐటీ యూనియన్లను కూడ తప్పుబట్టారు. ఎవరూ వారికి మద్దతు ఇవ్వడం లేదన్నారు. అలాగే యూనియన్లతో పాటు వెళ్ళే వ్యక్తులు ఎప్పటికీ ఉద్యోగాలను పొందలేరని హెచ్చరించారు.

కొంపముంచిన ఇన్పోసిస్ సివోవో వ్యాఖ్యలు

కొంపముంచిన ఇన్పోసిస్ సివోవో వ్యాఖ్యలు

ఇన్పోసిస్ సంచలన వ్యాఖ్యలతో మార్కెట్లో తీవ్ర ప్రభావం చూపాయి. ఇన్పీ టాప్ ఎగ్జిక్యూటివ్ చేసిన కామెంట్లు ఐటీ షేర్ల కొంపముంచాయి. ఇన్పీ సీవోవో ప్రవీణ్ రావు తమ ఖాతాదారుల ఐటీ వ్యయాలను తగ్గనున్నాయన్న వ్యాఖ్యలతో మార్కెట్లో ఐటీ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.తమ అంతర్జాతీయ ఖాతాదారులు బిల్డింగ్ రేటును దాదాపు 50 శాతం తగ్గించాలని చూస్తున్నారన్నారు. ఇది 150 బిలియన్ డాలర్ల దేశీయ పరిశ్రమ ఆదాయంపై ప్రభావం చూపించనుందన్నారు. దీంతో ఇన్వెస్టర్లలో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో దాదాపు అన్ని ఐటీ షేర్లలో భారీ సెల్లింగ్ ప్రెజర్ కన్పించింది.ఇన్పోసిస్, టీసీఎస్, విప్రో , హెచ్ సి ఎల్ యాజమాన్యం వివరణ ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఈ వ్యవహరంపై ప్రవీణ్ రావు స్పందించారు. ప్రైస్ కట్ గురించి తాను చెప్పలేదన్నారు. తప్పుగా అర్ధం చేసుకొన్నారని చెప్పారు.

English summary
Jobs would be hard to come by in the IT sector in future for youngsters who have only B Tech degree, and companies would prefer to hire post-graduates with specialised expertise, says an industry veteran. In future, a B Tech is not adequate to get a good job, one must have an M Tech and specialisation, says T V Mohandas Pai, former HR head and ex-Chief Financial Officer of IT major Infosys.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X