వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు శుభవార్త: 25 శాతం రిక్రూట్ మెంట్ లో వృద్ది, వీరితోనే ఇన్పోసిస్ కు ముప్పు

ఉద్యోగాల కోత సంక్షోభంలో ఉన్న ఐటీ పరిశ్రమ మే మాసంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలను కల్పించింది. ఏప్రిల్ తో పోలిస్తే మే మాసంలో 25 శాతం వృద్ది సాధించిందని టైమ్స్ రిక్రూట్ మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ వెల్లడించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉద్యోగాల కోత సంక్షోభంలో ఉన్న ఐటీ పరిశ్రమ మే మాసంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలను కల్పించింది. ఏప్రిల్ తో పోలిస్తే మే మాసంలో 25 శాతం వృద్ది సాధించిందని టైమ్స్ రిక్రూట్ మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ వెల్లడించింది.

ఐటీ పరిశ్రమ మందగమనంలో ఉందనే వార్త కొంతకాలంగా విన్పిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకొన్న పరిణామాలు ఐటీ పరిశ్రమపై తీవ్రప్రభావం చూపుతున్నాయి.

దీంతో ఖర్చులను తగ్గించుకొనేందుకు సాఫ్ట్ వేర్ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్దం చేశాయి.

అయితే ఐటీ పరిశ్రమ సంక్షోభం కూరుకుపోవడానికి గాను అనేక కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.అయితే కొన్ని సాఫ్ట్ వేర్ సంస్థలు మాత్రం ప్రతి ఏటా నిర్వహించినట్టుగానే సమీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

ఉద్యోగుల ప్రతిభ ఆధారంగానే వారు కొనసాగుతున్నారని చెప్పారు. కానీ, పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపులు లేవని కొన్ని సంస్థలు ప్రకటిస్తున్నాయి. అయితే ఈ తరుణంలోనే ఏప్రిల్ మాసం కంటే అధికంగా మే మాసంలో రిక్రూట్ మెంట్ జరిగినట్టు నివేదికలు వెల్లడించడం నంచలనంగా మారింది.

భారీగా ఉద్యోగాలు

భారీగా ఉద్యోగాలు

ఈ ఏడాది ఏప్రిల్ మాసంతో పోలిస్తే మే లో 25 శాతం వృద్దిని సాధించిందని టైమ్స్ రిక్రూట్ మెంట్స ఇండెక్స్ రిపోర్ట్ వెల్లడించింది. మొత్తంగా ఉద్యోగాల కల్పన 4 శాతం వృద్దితో చేసిందని ఈ అధ్యయనంలో తేలింది. మే మాసంలో పుణె, జైపూర్ నగరాల్లో 20 శాతం పుంజుకొని బెస్ట్ రిక్రూటర్లుగా నిలిచాయని నివేదిక వెల్లడించింది.

టెక్నాలజీ వృద్దితో ఉద్యోగాల కల్పన

టెక్నాలజీ వృద్దితో ఉద్యోగాల కల్పన

ఐటీ, బిపిఓ రంగాల్లో ఆటోమేషన్ ఉద్యోగాల కోతలకు దారితీసినప్పటికీ ఈ టెక్నాలజీ కారణంగా వృద్ది చెందుతున్న ఆర్థిక వృద్ది ద్వారా నూతన ఉద్యోగాలు కూడ సృష్టించబడుతున్నాయనే వాస్తవాన్ని గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. 2016-17 లలో ఐటీ సెక్టార్ ఒక లక్ష 70 వేల ఉద్యోగాలకు జోడించిందన్న నాస్కామ్ నివేదికను నిపుణులు గుర్తుచేస్తున్నారు.

ఇన్సోసిస్ కు ముప్పుతెచ్చేది వారే

ఇన్సోసిస్ కు ముప్పుతెచ్చేది వారే

టెక్ దిగ్గజం ఇన్పోసిస్ ఎదుర్కొంటున్న ముప్పులను బహిరంగంగానే వెల్లడించింది. కంపెనీ బోర్డు, యాజమాన్య దృష్టిని పక్కకు మరలుస్తూ యాక్టివిస్టూ షేర్ హెల్డర్స్ కు తమకు ఆందోళనకరంగా మారినట్టు కంపెనీ తెలిపింది.యాక్టివిస్ట్ షేర్ హెల్డర్స్ అంటే కంపెనీలో వారికున్న హక్కులను వినియోగించుకొంటూ సంస్థ ప్రవర్తనను తమ గుప్పిట్లోకి తెచ్చుకొనేవారు. కంపెనీనీ నడపనప్పటికీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లపై మేనేజ్ మెంట్ పై ప్రభావం చూపుతారు. యాక్టివిస్ట్ షేర్ హెల్డర్స్ తో పాటు గత 12 నెలలుగా మీడియా కవరేజీ కూడ తమల్ని ఇబ్బంది పెడుతోందని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వార్షిక ఫైలింగ్ అధికారిక నష్టాలను వెల్లడించింది.

కార్పోరేట్ ప్రమాణాలు దెబ్బతిన్నాయి

కార్పోరేట్ ప్రమాణాలు దెబ్బతిన్నాయి

ఇన్పోసిస్ లో కార్పోరేట్ ప్రమాణాలు దెబ్బతిన్నాయని ఏకంగా ఆ కంపెనీ వ్యవస్థాపకులే బహిరంగంగా బోర్డు సభ్యులకు చురకలు అంటించారు. తమ వ్యూహత్మక ప్రణాళికలను అమలు చేయడంలో తమ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని తెలిపింది. అయితే ఏ ఇన్వెస్టర్ల గ్రూప్ ను ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతోందో కంపెనీ వెల్లడించలేదు. వ్యవస్థాపకులతో నడుస్తున్న వివాదం 2017 ఆర్థిక సంవత్సరంలో కొంత వృద్దిని దెబ్బతీసిందని ఇన్పోసిస్ ఇంతకుముందే ప్రకటించింది.

English summary
The IT services industry may be laying off many, but it remains the most aggressive hirer. In May , while overall talent demand grew by 4%, ITBPO recorded a whopping 24% rise in demand compared to April, according to a study by TimesJobs, the jobs search and recruitment platform.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X