వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఖాతాలో రూ.246 కోట్ల డిపాజిట్, ఆ డబ్బేవరిది?

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై: నోట్ల రద్దు సమయంలో జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై కన్నేసిన ఐటీ అధికారులు ఒక్కొక్క కేసును నిశీతంగా పరిశీలిస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత తమిళనాడుకు చెందిన ఓ ఖాతాలోకి ఒకేసారి రూజ246 కోట్లు డిపాజిట్ అయినట్టు ఆదాయపు పన్ను శాఖాధికారులు గుర్తించారు

అయితే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో చేరి ఈ మొత్తానికి పన్ను చెల్లించేందుకు తాను సిద్దంగా ఉన్నట్టుగా ఖాతాదారుడు అంగీకరించినట్టుగా ఐటీ శాఖాధికారులు అభిప్రాయపడ్డారు.

IT Department detects large 'suspicious' deposits from Tamil Nadu post-demonetisation

ఆ ఖాతాదారుడి వివరాలను మాత్రం ఐటీ శాఖాధికారులు మాత్రం వెల్లడించలేదు. తమిళనాడుకు చెందిన బడా రాజకీయ నేతగా ప్రచారం సాగుతోంది. మరో 441 అనుమానాస్పద ఖాతాల్లోకి రూ.240 కోట్ల డిపాజిట్ అయినట్టు ఆదాయపు పన్ను శాఖాధికారులు గుర్తించారు.

అయితే ఈ అకౌంట్లు ఎవరివి అనే విషయమై ఐటీ శాఖాధికారులు మాత్రం వెల్లడించలేదు. అనుమానాస్పద ఖాతాలను కలిగి ఉన్నవారు వివరణ ఇవ్వాలని ఆధాయపు పన్ను శాఖాధికారులు గుర్తించారు. అయితే ఇప్పటివరకు 18,220 మంది వివరణ ఇవ్వగా, మిగిలిన వారి నుండి స్పందన లేదు. బ్యాంకు అధికారుల సహయం లేకుండా బారీ లావాదేవీలు జరగడం అసాధ్యమని ఆదాయపు పన్నుశాఖాధికారులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

English summary
Unaccounted money to the tune of Rs 246 crore was deposited in a bank account in a post-demonetisation single transaction that had connections to a state politician, an IT official told ET on conditions of anonymity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X