వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్‌ మంత్రి నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధు బ్యాంకు ఖాతాలను జప్తుచేసిన ఐటీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పంజాబ్‌ రాష్ట్ర మంత్రి నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధుకు చెందిన రెండు బ్యాంకు ఖాతాలను ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం జప్తు చేసింది. రూ.52లక్షల మేర పన్ను బకాయిలు ఆయన నుంచి రావాల్సి ఉండటంతో ఐటీ విభాగం గురువారం ఈ చర్యలు తీసుకుంది.

దుస్తుల కొనుగోలుపై రూ.28.3లక్షలు, ప్రయాణ ఖర్చులపై రూ.38.2లక్షలు, సిబ్బంది వేతనాలపై రూ.47.1లక్షలు, వాహనాల ఇంధనంపై రూ.17.8లక్షలు.. తాను చెల్లింపులు చేయాల్సి ఉన్నట్లు గతంలో పన్ను గణనల్లో సిద్ధు పేర్కొన్నారు.

కాగా, ఈ లావాదేవీలను రుజువు చేసే బిల్లులు, రసీదులేవీ ఆయన సమర్పించలేకపోయారని ఐటీ అధికారులు తెలిపారు. దీంతో ఖర్చులుగా చూపించినవాటిలో 30 శాతం మొత్తాన్ని అనర్హమైనదిగా గుర్తించినట్లు వెల్లడించారు.

గత సంవత్సరం జనవరి 17న ఐటీ విభాగం ఈ మేరకు ఇచ్చిన ఆదేశంపై సిద్ధు అప్పీలు చేసుకున్నారు. అయితే అక్కడా ఆయనకు చుక్కెదురైంది. దీంతో ఐటీ విభాగం తాజాగా సిద్దు బ్యాంకు ఖాతాలను జప్తు చేసింది.

English summary
The Income Tax (IT) department recently seized two bank accounts of Punjab's state minister Navjot Singh Sidhu for the non-payment of taxes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X