వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్ను ఎగవేతదారులపై ఐటీ శాఖ కన్నెర్ర... ఇకపై ఆ లావాదేవీలపై కూడా సమాచారం ఇవ్వాల్సిందే..!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పన్ను ఎగవేత దారులపై ఆదాయపు పన్ను శాఖ ఇక కఠినంగా వ్యవహరించబోతోందా... ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిందేనా.. అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. పన్ను ఎగవతేదారులు డొనేషన్స్, కానుకలు, నగలు ఇలా కొన్నిటిని చూపి పన్ను ఎగవేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్ర ఆర్థికశాఖకు ఐటీ శాఖ తెలిపింది. అయితే దీనిపై కఠినంగా వ్యవహరించాలనే ప్రతిపాదన కేంద్ర ఆర్థిక శాఖ ముందుకు తీసుకొచ్చినట్లు సమాచారం.

కేంద్రం వద్ద ఐటీ శాఖ ప్రతిపాదన

కేంద్రం వద్ద ఐటీ శాఖ ప్రతిపాదన


ఐటీ శాఖ పన్ను ఎగవేతదారులపై కొరడా ఝూళిపించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ వద్ద ఓ ప్రతిపాదన పెట్టగా ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది ఆర్థికశాఖ. ఇకపై ప్రతి వ్యక్తి లావాదేవీలపై దృష్టి సారించాలని ఈ మేరకు వారు దాఖలు చేసే ఐటీ రిటర్న్స్‌పై ఒక కన్నేసి ఉంచాలని ఐటీశాఖ భావించింది. అంటే ఆర్థిక పరమైన సంస్థలు, ఇతర కంపెనీలతో ఒక వర్గం వారు చేసే లావాదేవీలకు సంబంధించిన సమాచారంను ఐటీశాఖకు తెలపాలని పేర్కొంది. ఇదే ప్రతిపాదనను కేంద్రం వద్దకు తీసుకురాగా అందుకు మద్దతు తెలిపింది.

 కొత్త జాబితాలో ఇవే...

కొత్త జాబితాలో ఇవే...

ఆర్థిక సంస్థలు, ఇతర కంపెనీలతో పలువురు జరిపే లావాదేవీలపై కన్నేసిన ఐటీశాఖ ఎలాంటి లావాదేవీలు తమతో పంచుకోవాలో ఒక జాబితాను సిద్ధం చేసింది. ఇందులో బంగారం కొనుగోలు, పలు వస్తువులు, పెయింటింగ్స్, లక్ష రూపాయలకు పైగా విలువ చేసే పాలరాతి ధరలు, విద్య కోసం చెల్లించే ఫీజులు, రూ.లక్షకు పైగా ఉండే డొనేషన్లు , బిజినెస్ క్లాసులో విమాన ప్రయాణం, విదేశాల ప్రయాణాలు, రూ.20వేలకు మించి హోటల్ బిల్స్, ఏడాదికి లక్షకు పైగా విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తున్నట్లయితే ఆ సమాచారం, రూ.20వేలకు పైగా ఆరోగ్య బీమా, రూ.50వేలకు పైగా జీవిత బీమా కలిగి ఉంటే ఆ సమాచారంను ఐటీశాఖకు తెలపాలని పేర్కొంది.

ఆదాయంకు మించి ఖర్చులు చేస్తున్నారు

ఆదాయంకు మించి ఖర్చులు చేస్తున్నారు

కొందరు వ్యక్తులు అధిక మొత్తంలో లావాదేవీలు చేస్తుంటారని అయితే అవేమీ పన్ను చెల్లించే సమయంలో పొందుపర్చరని ఐటీశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీటి పేర్లతో చాలా వరకు పన్ను ఎగవేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఏడాదికి రూ.2.5 లక్షలు మాత్రమే ఆదాయం చూపిస్తున్న వీరు... తమ పిల్లలను చాలా విలాసవంతమైన స్కూళ్లలో చదివిపిస్తున్నారని, మరికొందరు విదేశాలకు తరచూ వెళుతుంటారని అక్కడ చాలా ఖరీదైన విలాసవంతమైన హోటల్స్‌లో బసచేస్తారని చెప్పారు. వీటన్నిటికీ పన్ను చెల్లించరని తీరా పన్ను చెల్లించే సమయానికి తమ ఏడాది ఆదాయం రూ.2.5 లక్షలుగా పేర్కొంటారని చెప్పారు. అలాంటి వారికోసమే నిబంధనలను కఠినతరం చేస్తున్నామని చెప్పారు.

థర్డ్ పార్టీ సమాచారం ఇస్తుంది

థర్డ్ పార్టీ సమాచారం ఇస్తుంది

ఇదిలా ఉంటే ఈ అధిక మొత్తంలో లావాదేవీలకు సంబంధించి పన్ను చెల్లింపుదారులు తమకు తాముగా టాక్స్ రిటర్న్స్‌లో పొందుపర్చాల్సిన అవసరం లేదని ఇన్‌కమ్ టాక్స్ చట్టం కింద థర్డ్ పార్టీ ఈ అధిక మొత్తంలో లావాదేవీలకు సంబంధించిన సమాచారం ఫైల్ చేస్తుందని ఆ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో కొందరు తమ ఆదాయంకంటే ఎక్కువగా ఖర్చు చేస్తూ పన్ను ఎగవేస్తున్నారని అలాంటి వారిని గుర్తించడం సులభతరం అవుతుందని చెప్పారు. దీనివల్ల నిజాయితీగా పన్ను చెల్లించే వారిపై ప్రభావం చూపదని ఆ అధికారి వెల్లడించారు. భారత్‌లో 130 కోట్ల జనాభా ఉండగా ఇందులో 6.5 కోట్లు మంది మాత్రమే ఇన్‌కమ్ టాక్స్ రిటర్స్స్ దాఖలు చేస్తున్నారు. ఇందులో 1.5 కోట్లు మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారు.

English summary
The Ministry of Finance has defended the proposed move by the income tax department to collect information on transactions like payment of school fees and donations, purchase of high-value items like jewellery, TVs and ACs, and domestic business and foreign travel, saying this is the most “non-intrusive way” of catching tax evaders
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X