వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటీ దాడుల టైంలో అనుచిత ప్రవర్తన: తమిళ మంత్రిపై ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో ఐటీ సోదాలు కలకలం రేపాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ నివాసంలో పెద్ద ఎత్తున ఐటీ శాఖ నగదును గుర్తించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరో 12 మంది శశికళ వర్గం ఎమ్మెల్యేలపై ఐటీ అధికారులు కన్నేశారని తెలుస్తోంది.

అధికార పార్టీకి చెందిన మంత్రులు, నేతలపై ఐటీ శాఖ ప్రధానంగా దృష్టి సారించింది. సోదాల సమయంలో అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ డాక్యుమెంట్ల ఆధారంగా మరింతమంది మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఐటీ అధికారులు దృష్టి సారించనున్నారని తెలుస్తోంది.

ఐటీ అధికారులు తమిళనాడులో మరిన్ని దాడులు చేసే అవకాశముంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అధికారులు రూ.85 కోట్ల విలువైన పత్రాలు, నగదును ఇప్పటి దాకా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎక్కువ మొత్తాన్ని ఆర్కే నగర్ ఉప ఎన్నికల కోసం దాచిపెట్టినట్లుగా గుర్తించారు.

IT dept to file complaint against TN health minister Vijaybhaskar

మంత్రి విజయ భాస్కర్ నివాసంలో ఐటీ దాడులు జరిగాయి. ఆ తర్వాత మరిన్ని జరిగే అవకాశముందని చెబుతున్నారు.

నిబంధనల ప్రకారం ఐటీ దాడుల సమయంలో ఏ వ్యక్తి కూడా ఇంటిని వదలకూడదు. కానీ మంత్రి విజయభాస్కర్ మాత్రం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. అలా చేయకూడదని ఆపబోయిన సీఐఎస్ఎఫ్ జవానును మంత్రి తోసేశారు. ఈ అంశాన్ని అధికారులు ఎన్నికల కమిషన్‌కు రిపోర్ట్ చేశారు.

గత వారం విజయభాస్కర్ నివాసంలో దాడులు జరిపినప్పుడు ఐటీ అధికారుల పట్ల విజయభాస్కర్ అనుచితంగా వ్యవహరించారని ఆ రిపోర్టులో ఉంది. కాగా, ఆర్కే నగర్ ఉప ఎన్నికలకు డబ్బు వెళ్తుందన్న సమాచారంతో మొత్తం 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.

English summary
Abuse of money power and assaulting CISF jawan are two points mentioned in the report of the Central Board of Direct Taxes which conducted a raid in Tamil Nadu ahead of the R K Nagar by-elections. In the report by the CBDT, it is mentioned that the Health Minister of Tamil Nadu, Vijaybhaskar had pushed a CISF jawan before speaking with reporters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X