వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం సన్నిహితులపై ఐటీ కొరడా.. 50 చోట్ల సోదాలు.. 9 కోట్లు స్వాధీనం..!

|
Google Oneindia TeluguNews

ఇండోర్‌ : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌ నాథ్‌ సన్నిహితుడు, ఓఎస్‌డీ ప్రవీణ్‌ కక్కర్‌ ఇళ్లపై.. ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేయడం చర్చానీయాంశమైంది. ఏకకాలంలో మొత్తం 50 చోట్ల సోదాలు చేస్తుండటం కలకలం రేపింది.
ఆయనపై హవాలా లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది.

ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రవీణ్ కక్కర్ ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. మధ్యప్రదేశ్, ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఆయన నివాసంతో పాటు అధికారిక కార్యాలయంలో కూడా తనిఖీలు చేపట్టారు ఐటీ అధికారులు.

<strong>పొలిటికల్ యాడ్స్‌పై ఈసీ కన్ను.. ఆ రెండు రోజులు నిషేధం..!</strong>పొలిటికల్ యాడ్స్‌పై ఈసీ కన్ను.. ఆ రెండు రోజులు నిషేధం..!

IT dept raids On MP CM Kamal Naths close aides and seized Rs 9 crores

ఐటీ దాడులకు సంబంధించి దాదాపు 300 మంది సిబ్బంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ, గోవా, భులా, భోపాల్, ఇండోర్ తదితర 50 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. మరోవైపు అమైరా గ్రూప్‌ మోసర్‌ బేయర్‌ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలో ఏకంగా 30కి పైగా చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. కమల్ నాథ్ దగ్గరి బంధువు రతుల్ పురితో పాటు మరో సన్నిహితుడు రాజేంద్ర కుమార్ మిగ్లానీ ఇళ్లపై కూడా ఐటీ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు 9 కోట్ల రూపాయల నగదు లభ్యమైనట్లు సమాచారం.

English summary
The Income Tax Department Officials on Sunday conducted a raids, starting even before dawn, on properties with links to Madhya Pradesh chief minister Kamal Nath's nephew Ratul Puri and his close aides Praveen Kakkar and Rajendra Kumar Miglani. I-T sleuths searched at least 50 locations across Bhopal, Indore, Delhi and Goa as part of the raids.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X