India
  • search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

IT Hub: అక్కాచెల్లి మీద దాడి కేసులో ముగ్గురి అరెస్టు, దెబ్బకు తేరుకున్న పోలీసులు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అక్కాచెల్లెలి పట్ల అసభ్యంగా ప్రవర్తించి వారి బట్టలు చింపేసి చితకబాదిన కేసులో బెంగళూరు పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఐటీ హబ్ సమీపంలో కలకలం రేపిన ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. బెంగళూరు గ్రామీణ జిల్లాలోని ఆనేకల్ తాలుకాలోని సర్జాపుర సమీపంలోని దోమ్మసంద్రలో నివాసం ఉంటున్న సుబ్బారెడ్డికి శాంతిప్రియా, భానుప్రియా అనే కుమార్తెలు ఉన్నారు.

Family: రెండో భార్య మోజులో కానీస్టేబుల్, మొదటి భార్య కొడుకు, కూతురు ఏం చేశారంటే ?, ఏదో అనుకుంటే!Family: రెండో భార్య మోజులో కానీస్టేబుల్, మొదటి భార్య కొడుకు, కూతురు ఏం చేశారంటే ?, ఏదో అనుకుంటే!

అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న రామక్రిష్ణారెడ్డి, ఇంద్రమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. సుబ్బారెడ్డి కుమార్తె శాంతిప్రియా ఆమె పిల్లల చదువు కోసం గత ఏడాది అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న రామక్రిష్ణారెడ్డి దగ్గర రూ. 1 లక్ష అప్పు తీసుకుంది. అప్పు తీసుకున్న రూ. లక్ష రూపాయలకు శాంతిప్రియా ప్రతినెల రూ. 9 వేలు వడ్డీ చెల్లించింది.

IT Hub: Assault on married woman over not paying debt in Dommasandra near Bengaluru, three arrested,
ఇటీవల అప్పు ఇచ్చిన రామక్రిష్ణారెడ్డి మా అసలు మొత్తం తిరిగి ఇచ్చేయాలని శాంతిప్రియాను డిమాండ్ చేశాడు. ప్రస్తుతం మాదగ్గర అంత డబ్బు లేదని, త్వరలో తిరిగి ఇచ్చేస్తామని శాంతిప్రియా రామక్రిష్ణారెడ్డికి చెప్పింది. ఇదే విషయంలో ఇరు వర్గాల మద్య గొడవ జరిగింది. ఆ సమయంలో రామక్రిష్ణారెడ్డి కుమారుడు సునీల్ రుణం తీసుకున్న శాంతిప్రియా ఇంటిలోకి వెళ్లి రాద్దాంతం చేశాడని స్థానికులు అంటున్నారు.

Wife: భార్యకు అక్రమ సంబంధం, ప్రియుడి దగ్గర రూ. 30 లక్షలు స్వాహా, క్లైమాక్స్ లో భార్య,భర్త !Wife: భార్యకు అక్రమ సంబంధం, ప్రియుడి దగ్గర రూ. 30 లక్షలు స్వాహా, క్లైమాక్స్ లో భార్య,భర్త !

ఆ సందర్బంలో సునీల్ తో పాటు అతని తల్లిదండ్రులు రామక్రిష్ణారెడ్డి, ఇంద్రమ్మ కలిసి శాంతిప్రియాతో పాటు ఆమె సోదరి భానుప్రియా బట్టలు చింపేసి కర్రలతో దాడి చేశారని శాంతిప్రియా కేసు పెట్టింది. ఐటీ హబ్ ఈ సంఘటన కలకలం రేపింది. మొదట చోద్యం చూసిన పోలీసులు తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో చివరికి రామక్రిష్ణారెడ్డి, సునీల్ తో పాటు మరో వ్యక్తిని శనివారం అరెస్టు చేశారు.

English summary
IT Hub: Assault on married woman over not paying debt in Dommasandra near Bengaluru, three arrested,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X