బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru: అర్దరాత్రి రచ్చ, ముస్లీం యువడితో మూత్రం తాగించిన ఎస్ఐ, గడ్డం కట్ చేసి ?, సస్పెండ్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అర్దరాత్రి ఓ ముస్లీం యువకుడు స్థానికులతో గొడవ పడుతున్నాడని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. అర్దరాత్రి ఆ యువకుడు టార్చర్ పెడుతున్నాడని స్థానికులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు అతన్ని అప్పుడే పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి బెండ్ తీశారు. తరువాత ఎస్ఐ ఆ యువకుడిని పట్టుకుని చితకబాదేశాడని తెలిసింది. క్రికెట్ బ్యాట్ తో యువకుడి మీద దాడి చేసిన పోలీసులు అతని గడ్డం కత్తిరించారని తెలిసింది. తాగడానికి నీళ్లు అడిగితే అతనితో మూత్రం తాగించారని ఆరోపణలు ఉన్నాయి. మాజీ మంత్రి, ఐటీ హబ్ లోని ఓ ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడంతో ఆ యువకుడిని పోలీసులు వదిలిపెట్టారని సమాచారం. బయటకు వచ్చిన యువకుడు జరిగిన దారుణంగా గురించి కుటుంబ సభ్యులకు చెప్పి ఆసుపత్రిలో చేరాడు. వివాదం పెద్దది కావడంతో సీనియర్ పోలీసు అధికారులు ముస్లీం యువకుడి గడ్డం కత్తిరించి అతనితో మాత్రం తాగించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ, మరో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసి ఉన్నతస్థాయి అధికారుల విచారణకు ఆదేశాలు జారీ చెయ్యడం కలకలం రేపింది.

Illegal affair: భర్త లేడు, నాటుకోడి లేడీతో మేస్త్రీ మస్త్ మజా, చంపేసి శవం పక్కన నిద్రపోయి !Illegal affair: భర్త లేడు, నాటుకోడి లేడీతో మేస్త్రీ మస్త్ మజా, చంపేసి శవం పక్కన నిద్రపోయి !

 అర్దరాత్రి రచ్చరచ్చ

అర్దరాత్రి రచ్చరచ్చ

ఐటీ హబ్ బెంగళూరులోని బ్యాటరాయణపుర పోలీస్ స్టేషన్ పరిధిలో తౌసిఫ్ పాషా (23) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అర్దరాత్రి 1 గంట సమయంలో తౌసిఫ్ పాషా స్ధానికులకు నిద్రలేకుండా చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. స్థానికులు పోలీసులకు ఫోన్ చెయ్యడంతో అర్దరాత్రి బ్యాటరాయణపుర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

 బెండ్ తీసిన పోలీసులు

బెండ్ తీసిన పోలీసులు

అర్దరాత్రి తౌసిఫ్ పాషా మాకు టార్చర్ పెడుతున్నాడని, ఎంత చెప్పినా అతను ఎవ్వరి మాట వినడం లేదని, రోజూ ఇదే పంచాయితీ ఎక్కువ అవుతోందని స్థానికులు ఫిర్యాదు చెయ్యడంతో బ్యాటరాయణపుర పోలీసులు అతన్ని అప్పుడే పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి బెండ్ తీసి అతన్ని విచారణ చేశారు.

 క్రికెట్ బ్యాట్ తో దాడి, మూత్రం తాగించారని ?

క్రికెట్ బ్యాట్ తో దాడి, మూత్రం తాగించారని ?

పోలీస్ స్టేషన్ లో బ్యాటరాయణపుర సబ్ ఇన్స్ పెక్టర్ (ఎస్ఐ) హరీష్ తో పాటు మరో ఇద్దరు పోలీసులు క్రికెట్ బ్యాట్ తీసుకుని తౌసిఫ్ పాషా కడుపులో కొట్టి చిత్రహింసలకు గురి చేశారని అతని తండ్రి అస్లాం పాషా ఆరోపిస్తున్నాడు. తాగడానికి నీళ్లు అడిగిన తన కొడుకుతో ఎస్ఐ హరీష్, మరో ఇద్దరు పోలీసులు మూత్రం తాగించారని తౌసిఫ్ పాషా తండ్రి అస్లాం పాషా ఆరోపిస్తున్నాడు.

 మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోక్యంతో వదిలేశారు

మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోక్యంతో వదిలేశారు

తన కొడుకు తౌసిఫ్ పాషాను కేసు లేకుండా వదిలిపెట్టడానికి ఎస్ఐ హరీష్ తనను లంచం అడిగాడని అస్లాం పాషా ఆరోపించారు. చివరికి కర్ణాటక మాజీ మంత్రి, బెంగళూరులోని చిక్కపేట ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ ఖాన్ జోక్యం చేసుకోవడంతో తన కొడుకు తౌసిఫ్ పాషాను స్టేషన్ నుంచి పంపించారని అస్లాం పాషా ఆరోపించాడు.

 ముస్లీం యువకుడి గడ్డం కత్తిరించారని ఆరోపణలు

ముస్లీం యువకుడి గడ్డం కత్తిరించారని ఆరోపణలు

తన కొడుకు మీద క్రికెట్ బ్యాట్ తో దాడి చెయ్యడంతో పాటు అతనితో మూత్రం తాగించారని, పోలీస్ స్టేషన్ మొత్తం శుభ్రం చేయించారని అస్లా పాషా ఆరోపించారు. తన గడ్డం కత్తిరించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఇది మా మతం సాంప్రధాయం అని, దయచేసి గడ్డం కత్తిరించకూడదని వేడుకున్నా వినలేదని, ఇది మీ ప్రార్థనా మందిరం కాదు పోలీస్ స్టేషన్ అని చెప్పిన ఎస్ఐ హరీష్, మరో ఇద్దరు పోలీసులు చివరికి తన గడ్డం కత్తిరించేశారని తౌసిఫ్ పాషా ఆరోపిస్తున్నాడు.

 విచారణకు ఆదేశం

విచారణకు ఆదేశం

బ్యాటరాయణపుర ఎస్ఐ హరీష్ మీద మతపరమైన ఆరోపణలు రావడం కలకలం రేపింది. బాధితుడు తౌసిఫ్ పాషా బెంగళూరు సిటీ పశ్చిమ విభాగం జాయింట్ పోలీసు కమీషనర్ సంజీవ్ ఎం. పాటిల్ కు ఫిర్యాదు చేశారు. పై అధికారుల ఆదేశాలతో ఏసీపీ, డీసీపీ ప్రాథమిక విచారణ చేసి బ్యాటరాయణపుర ఎస్ఐ హరీష్ తో పాటు ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. ఎస్ఐ తో పాటు ఇద్దరు పోలీసుల మీద ఉన్నతస్థాయి విచారణకు బెంగళూరు సిటీ పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

English summary
IT HUB: Assaulting Muslim youth making him drink urine case, SI and cop suspended in Bengaluru City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X