IT Hub: బుక్ స్టాల్ లో డ్రగ్స్ దందా, ఎలా బయటపడిదంటే ?, పేద విద్యార్థుల టార్గెట్, వారం !
బెంగళూరు: స్కూల్ లో, కాలేజ్ లో చదువుతున్న విద్యార్థులు ఓ బుక్ స్టాల్ కు పోలో అని వెళ్లి వస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో చాల బుక్ స్టాల్స్ ఉన్నా ఎక్కువగా ఆ బుక్ స్టాల్ కే మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు వెళ్లి వస్తున్నారు. ఇటీవల ఎక్కువగా స్లమ్ లో నివాసం ఉంటున్న యువకులు ఆ బుక్ స్టాల్ కు క్యూ కట్టడం, పోలీసులు రంగంలోకి దిగడంతో డ్రగ్స్ దందా విషయం వెలుగు చూసింది.
Illegal
affair:
ప్రియుడి
మోజులో
పడిన
ఆంటీ,
భర్తను
ప్రియుడు
ఏం
చేశాడంటే
?,
భార్య
నాటకాలతో
షాక్!
బెంగళూరు నగరంలోని సదాశివనగర పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ చెయ్యడానికి ప్రయత్నించిన తౌసిఫ్, తబరేజ్ అనే ఇద్దరిని స్థానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు తబరేజ్, తౌసిఫ్ ను విచారణ చెయ్యడంతో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నిందితులు సేవించిన డ్రగ్స్ దెబ్బకు వారం రోజులు అయినా ఆకలికాదని వెలుగు చూసింది. బెంగళూరు నగరంలోని యశవంతపుర ఆర్ టీఓ కార్యాలయం సమీపంలోని పుట్టప్ప బుక్ స్టాల్ లో మధ్యతరగతి, స్లమ్ లో నివాసం ఉంటున్న విద్యార్థులకు డ్రగ్స్ విక్రయిస్తున్నారని వెలుగు చూడటం కలకలం రేపింది.
పుట్టప్ప బుక్ స్టాల్ లో ఎక్కువ కిక్కు ఇచ్చే సెల్యూషన్ విక్రయిస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఈ సెల్యూషన్ ఉపయోగిస్తే వారం రోజులు అయినా ఆకలి కాదని, నీళ్లు తాగినా వాంతి అయిపోతుందని, వారం రోజులు పూర్తి మత్తులో ఉండాలనే యువకులు ఈ బుక్ స్టాల్ లో సెల్యూషన్, డ్రగ్స్ కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూడటం ఐటీ హబ్ లో కలకం రేపింది.