వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు శుభవార్త: ఈ ఏడాది ఐటీలో 2 లక్షల కొత్త ఉద్యోగాలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో ఐటీ రంగంలో సుమారు 2 లక్షల ఉద్యోగావకాశాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఐటీ రంగంలో కూడ మార్పులు చోటు చేసుకొంటున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

టెక్కీలకు శుభవార్త: 2018 లో ఐటీ పరిశ్రమకు మంచి రోజులుటెక్కీలకు శుభవార్త: 2018 లో ఐటీ పరిశ్రమకు మంచి రోజులు

అమెరికాలో ప్రభుత్వ మార్పిడితో పాటు ట్రంప్ తీసుకొన్న నిర్ణయాలు ఇండియా ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అయితే ఆటోమేషన్‌తో పాటు ఇతర కారణాలతో ఐటీ పరిశ్రమపై ప్రభావం చూపుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకొన్న మార్పుల కారణంగా ఐటీ రంగం మందగమనంలో ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఉద్యోగుల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడం లాంటి పరిణామాలతో ఐటీ పరిశ్రమలో ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నాయి.

కొత్త ఏడాదిలో 2 లక్షల మంది ఉద్యోగావకాశాలు

కొత్త ఏడాదిలో 2 లక్షల మంది ఉద్యోగావకాశాలు

2018 ఏడాదిలో దేశీయ ఐటీ రంగంలో 2 లక్షల మందికి కొత్తగా ఉపాధిని కల్పిస్తోందని నిపుణులు అంచనావేస్తున్నారు. 2017లో ఐటీ రంగంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడినట్టు నిపుణులు గుర్తు చేస్తున్నార. ఆటోమేషన్, సాంకేతిక కారణాలతో ఉద్యోగాలు తగ్గిపోయాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మొబైల్, ఆర్థిక సేవల రంగంలో అవకాశాలు

మొబైల్, ఆర్థిక సేవల రంగంలో అవకాశాలు

మొబైల్‌ తయారీ, ఆర్థిక సేవల సాంకేతికత, అంకురాల్లో అవకాశాలు బాగుంటాయని మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు.ఆర్థిక సేవల రంగం మెరుగుపడటం, డిజిటల్‌ వ్యాపారాలు పెరగడం, డిజిటలీకరణ-యాంత్రీకరణలో పెట్టుబడులు పెరగడం వంటివి ఐటీ రంగంలో ఉద్యోగాల వృద్దికి సహకరించనున్నట్టు చెప్పారు.

ఉద్యోగాలు కల్పించే సంస్థల్లో 20 శాతం పెరుగుదల

ఉద్యోగాలు కల్పించే సంస్థల్లో 20 శాతం పెరుగుదల

ఐటీ రంగంలో ఉద్యోగాలు కల్పించే సంస్థల్లో ఈ ఏడాది 20 శాతం పెరుగుదల ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.దీని ద్వారా రెండు లక్షల ఉద్యోగాలు ఈ ఏడాది ఐటీ రంగంలో వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

డిజిటలీకరణతో 50 శాతం అదనపు ఉద్యోగాలు

డిజిటలీకరణతో 50 శాతం అదనపు ఉద్యోగాలు

డిజిటల్‌ సాంకేతికతలో నైపుణ్యం ఉన్న 50 శాతం మంది అదనంగా అవసరమని పేర్కొన్నారు. 2030 నాటికి అంతర్జాతీయంగా కృత్రిమమేధ ఒక్కటే 23 లక్షల ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.

English summary
The year 2017 was a year of disruption for Indian job landscape, but hiring scenario looks glossy in the new year with likely addition of 2 lakh jobs in the IT industry, experts say.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X