వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటీ శాఖ దాడులు, జయానంద్ వివాదాస్పద కామెంట్, రాజకీయంగా అవసరం, అసహనం !

వివాదాస్పద కామెంట్ చేసిన శశికళ మేనల్లుడు, రూ. 30 వేల కోట్ల ఆస్తిఐటీ దాడులు రాజకీయంగా అవసరం, 70 గంటలు సోదాలు మాకు అనుభవంమండిపడుతున్న శశికళ అనుచరులు, అతని తండ్రి దివాకరన్ కు ఐటీ శాఖ నోటీసులు

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఆదాయానికి మించిన అక్రమాస్తులు సంపాధించారని ఆరోపణలు రావడంతో శశికళ కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల నివాసాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. దాదాపు రూ. 30 వేల కోట్ల విలువైన ఆస్తులు శశికళ కుటుంబ సభ్యులకు ఉన్నాయని వెలుగు చూసింది.

శశికళకు ఐటీ షాక్: అధికారుల ముందు కృష్ణప్రియ, షకీల, వెనక్కి తగ్గిన చిన్నమ్మ ఫ్యామిలీ!శశికళకు ఐటీ షాక్: అధికారుల ముందు కృష్ణప్రియ, షకీల, వెనక్కి తగ్గిన చిన్నమ్మ ఫ్యామిలీ!

ఆదాయశాఖ లెక్కల్లోలేని రూ. 1, 430 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు. ఆదాయపన్ను శాఖ అధికారుల దెబ్బతో శశికళ ఫ్యామిలీ దిమ్మ తిరిగింది. ఐటీ శాఖ అధికారుల విచారణ నుంచి ఎలా తప్పించుకోవాలి అంటూ శశికళ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

IT interrogation is essential politics says Jeyanandh

శశికళ సోదరుడు దివాకరన్ ఇంటిలో, కార్యాలయంలో, ఆయన విద్యాసంస్థలో సోదాలు చేసిన ఐటీ శాఖ వర్గాలు విచారణకు హాజరుకావాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే శశికళ సోదరుడు దివాకరన్ కుమారుడు జయానంద్ తన ఫేస్ బుక్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

జైల్లో శశికళ, ఇళవరసిని విచారణ, ఐటీ శాఖ ప్లాన్: కర్ణాటక అధికారులకు లేఖ, అనుమానం!జైల్లో శశికళ, ఇళవరసిని విచారణ, ఐటీ శాఖ ప్లాన్: కర్ణాటక అధికారులకు లేఖ, అనుమానం!

70 గంటల పాటు ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారని, ఇది మాకు చక్కటి అనుభవం, రాజకీయంగా ఐటీ శాఖ దాడులు ఎంతో అవసరం అయ్యాయని ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. రాజకీయ ఒత్తిడితో ఐటీ శాఖ దాడులు చెయ్యలేదని శశికళ మేనల్లుడు, జాజ్ సినిమాస్ సీఇవో, జయ టీవీ ఎండీ వివేక్, అతని సోదరి కృష్ణప్రియ మీడియాకు చెప్పిన ఒక్క రోజు తరువాత జయానంద్ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడంతో శశికళ అనుచరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Jeyanandh Divakaran said that "70 hours of interrogation with the income tax department was a good experience that is quite essential for politics" in his facebook page.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X