వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కావేరీ తీర్పు: తమిళనాడులో ఆందోళన, సీఎం పళనిస్వామి స్పందన, సంతోషం, అయితే !

|
Google Oneindia TeluguNews

Recommended Video

CM Edappadi Palanisamy Happy Over Cauvery Verdict

చెన్నై: కావేరీ జలాలపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తమిళనాడులో రైతులు ఆందోళనకు దిగడంతో ఆ రాష్ట్రంలో చేపట్టా ల్సిన భద్రతా ఏర్పాట్లు గురించి ముఖ్యమంత్రి ఎడ ప్పాడి పళనిస్వామి పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. చెన్నైలోని గ్రీన్‌వేస్‌ రోడ్డులోని ఎడప్పాడి పళనిస్వామి నివాసంలో జరిగిన సమావేశంలో చెన్నై నగర పోలీసు కమిషనర్‌ సహా పోలీసు అధికారులు పాల్గొన్నారు. సీఎం పళనిస్వామి ఓ విషయంలో సంతోషం వ్యక్తం చేశారు.

జల్లికట్టు ఉద్యమం

జల్లికట్టు ఉద్యమం

కావేరీ తీర్పుకు వ్యతిరేకంగా చెన్నైలో జల్లికట్టు తరహా ఉద్యమం తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటక సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం పళనిస్వామి పోలీసు అధికారులకు సూచించారు.

పళనిస్వామి స్పందన

పళనిస్వామి స్పందన

కావేరీ జలాల వివాదంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు నిరాశమిగిల్చిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అన్నారు. కావేరీ జలాల తీర్పుపై పళనిస్వామి ఓ ప్రకటన విడుదల చేస్తూ తమిళనాడుకు రావాల్సిన కావేరీ జలాల పరిమాణాన్ని 177 టీఎంసీలకు తగ్గించడం విచారకరమని అన్నారు. అయితే కావేరీ నిర్వాహక మండలి ఏర్పాటుకు సుప్రీం కోర్టు ఆదేశించడం శుభపరిమాణమని సీఎం పళనిస్వామి చెప్పారు.

 డీఎంకేతో నాశనం

డీఎంకేతో నాశనం

కావేరీ నిర్వహణ మండలి సక్రమంగా పనిచేసేలా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తీసుకువస్తుందని ఎడప్పాడి పళనిస్వామి అన్నారు. సుప్రీం కోర్టు తీర్పుతో రాష్ట్ర హక్కులేవీ హరించుకుపోలేదని, వాస్తవానికి డీఎంకే ప్రభుత్వ హయంలోనే కావేరీ జలాలపై అనేక హక్కులను కోల్పోయామని సీఎం ఎడప్పాడి పళనిస్వామి విమర్శించారు. కావేరీ నది ఏ ఒక్క రాష్ట్రం సొంతం కాదని సుప్రీం కోర్టు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని సీఎం ఎడప్పాడి పళనిస్వామి అన్నారు.

చెన్నైలో కర్ణాటక సంస్థలకు !

చెన్నైలో కర్ణాటక సంస్థలకు !

కావేరీ జలాల వివాదంలో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో చెన్నై నగరంలో కర్ణాటకకు సంబంధించి పాఠశాలు, వ్యాపార సంస్థలు, హోటళ్ల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. టీ. నగర్‌లోని కర్ణాటక సంఘం పాఠశాల, రాయపేట, చింతాద్రి పేట, అన్నాగనర్, బ్రాడ్‌వే, మైలాపూరు, తాంబరం, పెరంబూరు తదితర ప్రాంతాలలో కర్ణాటకకు చెందిన ప్రముఖ సంస్థలు, కర్ణాటక బ్యాంక్‌ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

రైతుల ఆందోళన

రైతుల ఆందోళన

కావేరీ జలాల పంపిణి విషయంలో సుప్రీం కోర్టు తీర్పుతో తమిళనాడు రైతులు తీవ్ర ఆందోళనకు దిగారు. కావేరీ నది నుండి 192 టీఎంసీల జలాల కన్నా కాస్త ఎక్కువగా నీరు కేటాయిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇస్తుందని ఆశలు పెట్టు కున్న రైతులకు చివరికి నిరాశే మిగిలింది.

సాగునీరు

సాగునీరు

సుప్రీం కోర్టు తీర్పు వల్ల కావేరీ డెల్టా జిల్లాల్లోని భూములకు సాగునీరు అందకుండా పోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పుతో తమిళనాడు రాష్ట్ర మొత్తం రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. కర్ణాటకకు వెళ్లే బస్సులను రైతు సంఘాలు అడ్డుకుంటున్నాయి.

ప్రతిపక్షాలు

ప్రతిపక్షాలు

తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కర్ణాటకకు చెందిన సంస్థల వద్ద పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. కావేరీ జలాలను అధికం చేయ్యాలని అడిగితే సరఫరా అవుతున్న నీటిని తగ్గించడం అన్యాయమని తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

ప్రతికూలంగా తీర్పు

ప్రతికూలంగా తీర్పు

కావేరి జలాల వివాదంలో సుప్రీం కోర్టు తీర్పు కర్ణాటకకు సానుకూలంగా తమిళనాడుకు ప్రతికూలంగా రావడంతో ముందు జాగ్రత్త చర్యగా చెన్నై నగరంతో సహ తమిళనాడు నుంచి కర్ణాటక వెళ్లే అన్ని బస్సు సర్వీసులు పూర్తిగా నిలిపివేశారు. కర్ణాటక నుంచి తమిళనాడుకు వెళ్లే బస్సు సర్వీసులు దాదాపుగా నిలిపివేశారు.

English summary
It is disappointing that water is reduced to TN in Cauvery says Tamil Nadu CM Edappadi Palanisamy. He says that Cauvery verdict in a injustice to Tamil people
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X