వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపే కేంద్ర క్యాబినెట్... కశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ...?

|
Google Oneindia TeluguNews

బుధవారం సాయంత్రం కేంద్రకేబినెట్ సమావేశం కానుంది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన కొనసాగనున్న మంత్రివర్గ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈనేపథ్యంలోనే కశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కశ్మీరీ యువతకు ప్రత్యేక ఉద్యోగాలతోపాటు, కశ్మీర్ అభివృద్దికి పెద్ద ఎత్తున నిధులను అందించేందుకు గాను ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

 జమ్ము కశ్మీర్ అభివృద్దికి హమీ ఇచ్చిన మోడీ

జమ్ము కశ్మీర్ అభివృద్దికి హమీ ఇచ్చిన మోడీ

జమ్ము కశ్మీర్‌‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామని ప్రధాని మోడీ తోపాటు పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రహుం శాఖ సహాయ మంత్రి అమిత్ షాలు ప్రకటించారు. ఈనేపథ్యంలోనే రెండు కేంద్ర పాలితా ప్రాంతాల అభివృద్దికి కట్టుబడి ఉన్నామని హమీ ఇచ్చారు. జమ్ము కశ్మీర్‌లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రయత్నాలు చేసిన కేంద్రం ఇప్పుడు వాటిని అమల్లో పెట్టేందుకు సిద్దమైంది. ఈ నేపథ్యంలోనే ఆర్ధిక వెనకబాటు తనంతో ఉగ్రవాదం వైపు మొగ్గు చూపుతున్న యువతను కేంద్రం టార్గెట్ చేసుకుంది.

ఆర్మీ ,నేవీల్లో కశ్మీర్ యువతకు ఉద్యోగాలు

ఆర్మీ ,నేవీల్లో కశ్మీర్ యువతకు ఉద్యోగాలు

ఆర్టికల్ రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ ప్రాంతంలో సినిమా షూటింగ్‌లతో పాటు కశ్మీర్‌ను ప్రపంచ పర్యాటక ప్రాంతంగా తీర్చీ దిద్దుతామని అమిత్ షా ప్రకటించారు. ముఖ్యంగా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రేపు నిర్వహించబోయో కేబినెట్ సమావేశంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే ప్రకటనను చేయనున్నట్టు సమచారం. ముఖ్యంగా పోలీసు ఉద్యోగాల్లో యువతను ప్రోత్సహించేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆర్మీ, పారమిలటరీని దళాల్లో కశ్మీర్ యువతకు పెద్ద పీట వేసేందుకు ఆయా విభాగాలను కూడ కేంద్రం కోరనుంది.

 కశ్మీర్‌లో పర్యటిస్తున్న హైలెవల్ కమిటీ..

కశ్మీర్‌లో పర్యటిస్తున్న హైలెవల్ కమిటీ..


ఇప్పటికే కశ్మీర్‌‌లో ప్రాజెక్టులను నిర్మించేందుకు కావాల్సిన అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు మైనారిటీ సంక్షేమ శాఖ అధ్వర్యంలో ప్రతినిధి బృందం కశ్మీర్‌లో పర్యటిస్తోంది. కాగా ఈ బృందంలో ప్రభుత్వ సెక్రటరీలతోపాటు అత్యున్నత స్థాయి సభ్యులు ఉన్నారు. పరిశ్రమలతో పాటు అభివృద్దికి కావాల్సిన ఏర్పాట్లను కూడ కమిటి పరీశీలించనుంది. ఇందులో భాగంగానే విద్యాసంస్థలను ఏర్పాటును కూడ పరీశీంచనుంది. విద్యకు సంబంధించి మరిన్ని యూనివర్శిటిలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇదివరకే హమీ ఇచ్చింది. హైలెవల్ కమిటీ లద్దాక్‌‌లో కూడ పర్యటించనున్నట్టు మైనారీటీ సంక్షేమ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే క్యాబినెట్ సమావేశంలో కశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ కూడ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

English summary
Union Cabinet is scheduled to hold a meeting on Wednesday at Parliament Annexe Building at 4:30 PM and it is expected that Prime Minister Narendra Modi-led government at the Centre would make some big announcements related to Jammu and Kashmir during the meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X