బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లా పాయింట్ లాగిన సిద్ధ‌రామ‌య్య‌: ఇలాగైతే సంకీర్ణ ప్ర‌భుత్వం ఉండ‌దు

|
Google Oneindia TeluguNews

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌కలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌-జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్‌) కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం శాస‌న‌స‌భ‌లో బ‌ల‌ప‌రీక్ష‌ను ఎదుర్కొంటోంది. గురువారం ఉద‌యం ఆరంభ‌మైన ఈ బ‌ల‌ప‌రీక్ష కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్భంగా అధికార కాంగ్రెస్‌-జేడీఎస్‌, ప్ర‌తిప‌క్ష భార‌తీయ జ‌న‌తాపార్టీ స‌భ్యుల మ‌ధ్య పెద్ద ఎత్తున వాదోప‌వాదాలు కొన‌సాగుతున్నాయి. ప్ర‌భుత్వాన్ని నిల‌బెట్టుకోవ‌డానికి కాంగ్రెస్‌-జేడీఎస్ స‌భ్యులు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

బ‌ల‌పరీక్ష‌ను అడ్డ‌గించ‌డానికి అందుబాటులో ఉన్న అన్ని వ‌న‌రుల‌ను వినియోగించుకుంటున్నారు. ముఖ్య‌మంత్రి హెచ్‌డీ కుమార‌స్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య, భారీ నీటిపారుద‌ల శాఖ మంత్రి డీకే శివ‌కుమార్ త‌దిత‌రులు బ‌ల‌పరీక్ష‌లో నెగ్గ‌డానికి పావులు కదుపుతున్నారు.

it is not appropriate to take floor test, Till we get clarification on Supreme Court, says Siddaramaiah

సుప్రీంకోర్టు నుంచి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు రానిదే..
తిరుగుబాటు ఎమ్మెల్యేల‌పై దాఖ‌లైన పిటీష‌న్‌కు సంబంధించిన స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇంకా సుప్రీంకోర్టు నుంచి అందాల్సి ఉంద‌ని సిద్ధ‌రామ‌య్య చెప్పారు. సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాక‌ముందే- బ‌ల‌ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌డంలో అర్థం లేద‌ని అన్నారు. దీన్ని వాయిదా వేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఈ పిటీష‌న్‌పై వాదోప‌వాదాల‌ను ఆల‌కించిన సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం.. బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌పై ఇప్ప‌టిదాకా ఎలాంటి లిఖిత‌పూర‌క ఆదేశాల‌ను జారీ చేయ‌లేద‌ని గుర్తు చేశారు. ఇలాంటి త‌రుణంలో బ‌ల‌ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌డం సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్క‌రించిన‌ట్టే అవుతుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

ఎమ్మెల్యేల గైర్హాజ‌రీని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే..
కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఎన్నికైన ప‌లువురు శాస‌న స‌భ్యులు ప్ర‌స్తుతం స‌భ‌లో లేర‌ని, వారు గైర్హాజ‌రులో ఉన్నార‌ని సిద్ధ‌రామ‌య్య ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వారి రాజీనామాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకూడ‌ద‌ని స్పీక‌ర్ ర‌మేష్ కుమార్‌కు సూచించారు. గైర్హాజ‌రీలో ఉన్న‌ప్ప‌టికీ.. వారు త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌న‌ని అన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల సంఖ్య‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవాల‌ని చెప్పారు. వారిని లెక్కించ‌క‌పోతే- సంకీర్ణ ప్ర‌భుత్వానికి మ‌నుగ‌డ ఉండ‌ద‌ని సిద్ధ‌రామ‌య్య కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్ర‌కారం.. తిరుగుబాటు ఎమ్మెల్యేలు స‌భ‌కు హాజ‌రు కాలేద‌ని అన్నారు. వారిని లెక్క‌లోకి తీసుకోక‌పోతే- సంకీర్ణ ప్ర‌భుత్వం తీవ్రంగా న‌ష్ట‌పోతుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

English summary
Till we get clarification on Supreme Court's previous order, it is not appropriate to take floor test in this session which is against the Constitution, says Congress leader Siddaramaiah in Vidhana Soudha in Bengaluru. He said in the discussion in the Assembly session that, If we go ahead with the confidence motion, if the whip applicable and rebel MLAs don't come to the house because of the SC order, it will be a big loss to the coalition government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X