వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుస్థిర ప్రభుత్వం కష్టమే ... అపద్దర్మ ముఖ్యమంత్రి కుమారస్వామీ

|
Google Oneindia TeluguNews

కర్ణాటకలోని ప్రస్థుత పరిస్థితుల్లో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదని ఆ రాష్ట్ర ఆపద్దర్మ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల రాజీనామాలతో ఉప ఎన్నికలు జరగనున్నాయని పేర్కోన్న అయన ఎన్నికల అనంతరం కూడ మెజారిటి ప్రభుత్వం ఏర్పడడం కష్టమని తెలిపారు.

Recommended Video

శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక సీఎం
it is not possible to form a stable government :former Chief Minister Kumaraswamy

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం పడిపోవడంతో కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ సీఎం అభ్యర్థిగా యడ్యూరప్పను పార్టీ నేతలు ఎన్నుకున్న ప్రభుత్వ ఏర్పాటుకు కేంద్రం వేచి చూసే ధోరణి కనబరుస్తోంది. గతంలో ఓసారి ప్రభుత్వం పడిపోయిన నేపథ్యంలోనే ఈ సారి అబాసు పాలు కాకుండా పూర్తి మెజారిటి కోసం బీజేపీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే అచితూచి అడుగులు వేస్తోంది. సీఎం పీఠంపై ఢిల్లీ నేతలు చర్చలు జరుపుతున్నారు.

ఇక మరోవైపు స్పికర్ రమేష్ కుమార్ రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు చర్యలకు తెరలేపాడు. మొత్తం 15 మంది రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామ చేయగా వారిలో మొదటి దఫాగా ముగ్గురిపై అనర్హత వేటు వేశాడు. దీంతోపాటు ఉప ఎన్నికల్లో పోటి చేయకుండా ఆదేశాలు జారి చేశారు. ఇలాంటీ పరిస్థితుల్లో పూర్తి మెజారిటి లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసి సుస్ధిరంగా ఉంటుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈనేపథ్యంలోనే మాజీ సీఎం కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి.

English summary
Karnataka former Chief Minister Kumaraswamy has made it clear that it is not possible to form a stable government under the prevailing conditions in Karnataka. Noting that the by-election will be held with the resignations of the MLAs, he said it would be difficult to form a majority government after the election also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X