వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో పెరిగిన నిరుద్యోగం, 45 ఏళ్లలో అధికమన్న గణాంకశాఖ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : దేశం అభివృద్ధి చెందుతుంది .. సంక్షేమ తమ ప్రథమ ప్రాధాన్యమని ప్రభుత్వాలు ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నాయి. కానీ వాస్తవం మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. ఏటా విడుదలవుతున్న గణంకాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. భారీ మెజార్టీతో రెండోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసిన రోజే చేదు వార్తను కేంద్ర స్టాటిస్టిక్స్ విభాగం ప్రకటించింది.

చావు కబురు చల్లగా ..
దేశంలో నిరుద్యోగం పెరుగుతుందని కేంద్ర స్టాటిస్టిక్స్ మంత్రిత్వశాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది దేశంలో 45 ఏళ్లలో అధికమని పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో 6.1 శాతం నిరుద్యోగం ఉందని చేదు విషయాన్ని అధికారులు విడుదల చేశారు. ఇదే విషయాన్ని బిజినెస్ స్టాండర్ట్ ఇదివరకే ప్రచురించిన సంగతి తెలిసిందే. అప్పుడు ప్రభుత్వం తోసిపుచ్చింది. అంతేకాదు .. ఇదీ తుది నివేదిక కాదు .. అలా ఎలా లీకుల ఆధారంగా నివేదిక ప్రచురిస్తామని బిజినెస్ స్టాండర్డ్‌పై ఒంటికాలిపై లేచింది. కానీ ఇన్నాళ్లకు అదే రిపోర్టు కాపీ తూ.చ తప్పకుండా .. ఏ మార్పు చేయకుండా విడుదల చేశారు పాలక ప్రభువులు.

It is official: Indias unemployment rate at 6.1%, rises to 45-year high

అంతేకాదు ఎన్నికల ముందు నిరుద్యోగానికి సంబంధించి జాబితాను విడుదల చేయాలని ప్రతిపక్షాలు నెత్తి, నోరు బాదుకున్నా పాలకపక్షం పెడచెవిన పెట్టింది. ఎంత ఆందోళన చేసినా స్పందించలేదు. కావాలనే నివేదికను పక్కనపెట్టి .. ఎన్నికలు ముగిసి అధికారం చేపట్టాక పాత చింతకాయ పచ్చడిలా అదే నివేదికను బయటపెట్టి తన కపటబుద్దిని బయటపెట్టుకుంది. ఒకవేళ ఆ సమయంలో నివేదిక బహిర్గత పరిస్తే .. తమకు ఎక్కడా వ్యతిరేకత వస్తుందని భావించి .. కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టింది మోడీ తొలి క్యాబినెట్. ఇప్పుడు మెల్లగా చావు కబురు చల్లగా చెప్పింది.

వ్యుహాత్మకం ..
మోడీ 2.0 మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేశాక డేటాను విడుదల చేసి .. వ్యుహాత్మకంగా వ్యవహరించింది. ఇక దీనిపై ప్రతిపక్షాలు స్పందించాల్సి ఉంది. ఈ నివేదికలో పట్టణాల్లో 7.8శాతం మంది యువత ఉద్యోగాల్లేక ఉన్నారనే కఠోర వాస్తవాన్ని తెలిపింది. వీరు వివిధ కారణాల రీత్యా జాబ్ చేయడం లేదని వెల్లడించింది. హై ప్రొఫైల్ ఉన్న వారు చిన్న కొలువు చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడం మరో కారణం.

ఇక శాతం గ్రామాల్లో 5.3 శాతం ఉన్నదని తెలిపింది. ఈ రెండింటినీ కలిపితే దేశవ్యాప్తంగా 6.2 శాతం నిరుద్యోగిత ఉంది. అయితే ఇందులో 5.7 శాతం మంది మహిళలు కూడా ఆందోళన కలిగిస్తోంది. సాబ్ కా సాత్ .. సాబ్ కా వికాస్ అంటున్న మోదీ సర్కార్ హయాంలో నిరుద్యోగం పెరగడం ఏంటనే విమర్శలు వచ్చే అవకాశం ఉంది.

English summary
the government has finally confirmed that unemployment rate in the country is at a 45-year high. Data released by the Union Ministry of Statistics reveal that India's unemployment rate stands at 6.1 per cent. The government data shows that the unemployment rate has risen to a 45-year high in 2017-18. The same figure on unemployment was mentioned in a report by Business Standard that was based on a leaked official report. The government had then brushed off the issue saying the report had not been finalised. In the run-up to the 2019 Lok Sabha election, the Opposition had alleged that the Narendra Modi government was intentionally withholding the data on unemployment faring negative impact on its electoral prospects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X