వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Citizenship Bill: ‘హిందూ రాష్ట్ర’ అంటూ ఆర్ఎస్ఎస్‌పై ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: భారత లోక్‌సభ పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం లభించడంపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన అక్కసును వెల్లగక్కారు. బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్లు ద్వారా అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని భారత్ ఉల్లంఘించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

citizenship amendment bill: ఆ 3 దేశాల ముస్లింలకు పౌరసత్వంపై తేల్చేసిన అమిత్ షా, లోక్‌సభ ఆమోదంcitizenship amendment bill: ఆ 3 దేశాల ముస్లింలకు పౌరసత్వంపై తేల్చేసిన అమిత్ షా, లోక్‌సభ ఆమోదం

పౌరసత్వ సవరణ బిల్లుతో పాకిస్థాన్‌తో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందానికి భారత్ తూట్లు పొడిచిందని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. ఇక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పైనా ఇమ్రాన్ విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ బిల్లు ద్వారా హిందూ రాష్ట్ర భావనను విస్తరించేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.

It is part of RSS Hindu Rashtra design, Pak PM Imran Khan slams Citizenship Bill

కాగా, పౌరసత్వ సవరణ బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ బిల్లుకు మద్దతుగా 311 ఓట్లు రాగా.. 80 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారతదేశానికి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించింది.

పౌరసత్వ బిల్లుపై అమిత్ షా ఏమన్నారంటే..

ముస్లింలపై వివక్ష తమ ఉద్దేశం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుపై పార్లమెంటులో చర్చ సందర్భంగా సోమవారం రాత్రి అమిత్ సమాధానమిచ్చారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో ముస్లింలు మైనార్టీలుగా లేరని అందుకే వారిని.. ఈ సవరణ బిల్లు ద్వారా దేశంలోకి అనుమతించడం లేదని తేల్చి చెప్పారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో భారతీయులందరికీ రక్షణ ఉంటుందని అమిత్ షా వ్యాఖ్యానించారు. మైనార్టీలుగా ఉన్న హిందువులు, సిక్కులు, పార్సీలు, జైనులు, బౌద్ధులు, క్రైస్తవులు ఆ దేశాల్లో ఉండలేని పరిస్థితిల్లోనే మనదేశానికి వస్తున్నారని, అందుకే వారికి పౌరసత్వం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.

English summary
Pakistan has condemned as "regressive and discriminatory" India's Citizenship Amendment Bill and called it a "malafide intent" by New Delhi to "interfere" in the affairs of neighbouring countries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X