వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటీకి మరో షాక్: రూ.10వేల కోట్ల పన్ను భారం, సర్వీస్ ట్యాక్స్ నుంచి నోటీసులు

దేశంలోని ఐటీ ఆధారిత కంపెనీలకు ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖ నుంచి షాక్ తగిలింది. విదేశీ ఎగుమతులపై దాదాపు కంపెనీలు రూ.10వేల కోట్ల ట్యాక్స్ బకాయి పడ్డాయంటూ నోటీసులు జారీ చేసింది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

IT Companies Got Shock Over Rs 10,000 Crore Tax Demand

న్యూఢిల్లీ: దేశంలోని ఐటీ ఆధారిత కంపెనీలకు సర్వీస్ ట్యాక్స్ శాఖ నుంచి షాక్ తగిలింది. విదేశీ ఎగుమతులపై దాదాపు కంపెనీలు రూ.10వేల కోట్ల ట్యాక్స్ బకాయి పడ్డాయంటూ నోటీసులు జారీ చేసింది. దీంతో ఇప్పటికే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న ఐటీ కంపెనీలకు మరిన్ని గడ్డు పరిస్థితులు తప్పేలా లేవు.

200సంస్థలకు నోటీసులు:

200సంస్థలకు నోటీసులు:

దాదాపు 200కంపెనీలకు సర్వీస్ ట్యాక్స్ శాఖ నుంచి నోటీసులు జారీ చేశాయి. కేవలం పన్నుల చెల్లింపు మాత్రమే కాదు.. ఆలస్యం జరిగినందుకు వడ్డీ, జరిమానాలు కలిపి అదనంగా 15శాతం పన్ను చెల్లించాలని సర్వీస్ ట్యాక్స్ శాఖ పేర్కొంది. దీంతో పన్ను భారం మరింత పెరిగినట్టయింది.

ఐటీకి ఏమైంది?: కెరీర్‌పై నిజంగానే కత్తి వేలాడుతోందా?, ఇదీ అసలు మర్మం..ఐటీకి ఏమైంది?: కెరీర్‌పై నిజంగానే కత్తి వేలాడుతోందా?, ఇదీ అసలు మర్మం..

రిటర్న్స్ దాఖలు చేయాలని:

రిటర్న్స్ దాఖలు చేయాలని:

2012-16 మధ్య కాలంలో ఆయా ఐటీ కంపెనీలు విదేశాలకు సాఫ్ట్‌వేర్‌ ఎగుమతి చేయడం ద్వారా పొందిన ప్రయోజనాల రిటర్న్స్ దాఖలు చేయాలని సర్వీస్ ట్యాక్స్ శాఖ నోటీసుల్లో పేర్కొంది. అయితే సాఫ్ట్ వేర్ వ్యవహారాలన్ని ఈమెయిల్ ద్వారానే జరుగుతాయి కాబట్టి వాటిని ఎగుమతులుగా పరిగణమించడం పట్ల కంపెనీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ఎగుమతి కిందకు రాదు:

ఎగుమతి కిందకు రాదు:

సాధారణంగా విదేశాల్లోని క్లైంట్స్ కు సాఫ్ట్‌వేర్‌ను అందించడం ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీలకు ఎగుమతి చేసినట్టు కాదు. క్లైంట్ తమకు కావాల్సిన సాఫ్ట్ వేర్ వివరాలను భారత ఐటీ కంపెనీలకు పూర్తి వివరాలతో మెయిల్ చేస్తారు. ఇదంతా మెయిల్ ద్వారా జరిగే వ్యవహారం కాబట్టి దీన్ని వస్తువు సేవల కిందకు పరిగణించడంపై చర్చ జరుగుతోంది. అయితే పన్నుల శాఖ మాత్రం ఇది అందుబాటులో ఉన్న వస్తువులను విదేశీ క్లయింట్స్ కు విక్రయించడమే అని వాదిస్తోంది.

అలా చేసినా ఫలితం ఉండదు;

అలా చేసినా ఫలితం ఉండదు;

కంపెనీలు ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌కు వెళ్లినా ఫలితం ఉండదని పరిశీలకులు చెబుతున్నారు.ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలన్నా.. చెల్లించాల్సిన ట్యాక్సులో 10శాతమైనా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ట్యాక్స్ పై కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. దీనికి తోడు జీఎస్టీ కూడా తోడవడంతో పన్నుల భారం మరింత పెరగనుంది.

English summary
The tax department has raised service tax demand of about Rs 10,000 crore from information technology and IT-enabled services companies in the country, sending a shockwave through an industry already reeling under tighter US immigration laws and increasing automation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X