వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడులో ఐటీ దాడుల కలకలం, టార్గెట్ ప్రతిపక్షం, లోక్ సభ డీఎంకే అభ్యర్థి, తండ్రికి షాక్!

|
Google Oneindia TeluguNews

చెన్నై: లోక్ సభ ఎన్నికల సందర్బంగా కర్ణాటకలో పలువురు నాయకుల నివాసాలు, కార్యాలయాల మీద దాడులు చేసిన ఆదాయపన్ను శాఖ (ఐటీశాఖ) అధికారులు ఇప్పుడు పక్క రాష్ట్రం మీద కన్ను వేశారు. శనివారం వేకువ జామున నుంచి తమిళనాడులోని డీఎంకే నేతల మీద ఐటీ శాఖ సోదాలు చెయ్యడంతో కలకలంరేపింది.

కర్ణాటక మంత్రికి ఐటీ శాఖ షాక్, సీఎం సన్నిహితుడు, ఒక్క రోజు ముందే జోస్యం చెప్పిన సీఎం!కర్ణాటక మంత్రికి ఐటీ శాఖ షాక్, సీఎం సన్నిహితుడు, ఒక్క రోజు ముందే జోస్యం చెప్పిన సీఎం!

తమిళనాడులో ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే పార్టీ కోశాధికారి, ఆ పార్టీ సీనియర్ నేత దురైమురుగన్ కు చెందిన వేలూరు జిల్లాలోని కాట్పాడిలోని ఇల్లు, కార్యాలయాల్లో శనివారం వేకువ జామున నుంచి ఐటీ శాఖ అధికారులు సోదాలు ముమ్మరం చేశారు.

IT offical attempt to raid Durai Murugan’s house in Vellore in Tamil Nadu

ఆదాయపన్ను శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంగా శనివారం వేకువ జామున 2.30 గంటలకు మొదలైన సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. దురైమురుగన్ ఇంటిలోకి ఫైయింగ్ స్కాడ్ సిబ్బంది ప్రవేశించడానికి ప్రయత్నించడంతో ఆదాయపన్ను శాఖ అధికారులు, సీఆర్ పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు.

సీఎం కుమారస్వామి సోదరుడు, మంత్రి రేవణ్ణకు ఐటీ శాఖ షాక్, సోదాలు, నేను చూస్తాను, సీఎం ఫైర్!సీఎం కుమారస్వామి సోదరుడు, మంత్రి రేవణ్ణకు ఐటీ శాఖ షాక్, సోదాలు, నేను చూస్తాను, సీఎం ఫైర్!

మీరు ఇంటిలోకి రావడానికి ఎలాంటి అనుమతి లేదని వారిని వెనక్కి పంపించారు. దురైమురుగన్ కుమారుడు కదిర్ ఆనంద్ కు చెందిన సీబీఎస్ సీ స్కూల్, కాలేజ్ లో సోదాలు జరుగుతున్నాయి. తన కుమారుడు ఆనంద్ వేలూరు లోక్ సభ ఎన్నికల బరిలో ఉన్నారని, అతను ఎక్కడ విజయం సాదిస్తాడో అనే భయంతో కేంద్ర ప్రభుత్వంతో అన్నాడీఎంకే నాయకులు ఆదాయపన్ను శాఖతో దాడులు చేయించారని దురైమురుగన్ ఆరోపిస్తున్నారు. ఐటీ శాఖ దాడులతో తమను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారని దురైమురుగన్ ఆరోపించారు.సోదాలు చేస్తున్న ఐటీ శాఖ అధికారులు పలుకీలక పత్రాలు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.

English summary
Income tax investigators and officers of an Election Commission flying squad are conducting a search operation in premises linked to DMK Treasurer Durai Murugan, officials aware of the raid told ET.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X