వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"హవాలా" తుట్టె కదిలించిన ఐటీ శాఖ.. 25 కోట్ల నగదు స్వాధీనం

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : హవాలా తుట్టె కదిలించారు ఐటీ శాఖ అధికారులు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ రాకెట్ చేధించారు. చాందినీ చౌక్ ఏరియాలో ఓ ప్రైవేట్ సంస్థపై అధికారులు దాడిచేయడంతో హవాలా భాగోతం గుట్టురట్టైంది. అక్రమంగా నిర్వహిస్తున్న వందకు పైగా లాకర్లను తెరిపించారు. 8 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు 25 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.

పక్కా సమాచారంతో దాడులు నిర్వహించామని చెబుతున్నారు ఐటీ అధికారులు. హవాలాతో అక్రమ లావాదేవీలు నిర్వహించేవారు ఇలాంటి ప్రైవేట్ లాకర్లలో నగదు నిల్వలు దాచిపెడుతున్నట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో పట్టుబడ్డ సొమ్ము ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోని వ్యాపారులదయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో సాగే ఈ దందాలో హవాలా బ్రోకర్లకు పలువురితో సంబంధాలుంటాయని తెలిపారు.

it officers bust hawala lockers and seized 25 crores

హవాలా ద్వారా డబ్బు రవాణా చేస్తూ ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు అక్రమార్కులు. ఇలాంటి భారీ లాకర్ ఆపరేషన్లలో భాగంగా ఈ ఏడాదిలోనే ఇది మూడో సంఘటన కావడం గమనార్హం.

English summary
IT officials have hit a huge hawala rocket in Delhi. 25 crore rupees currency were seized form illegal lockers over a hundred.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X