వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడు సీఎం మీద తిరుగుబాటు: దినకరన్ వర్గం ఎమ్మెల్యేకి ఐటీ శాఖ షాక్, దాడులు !

తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటుదినకరన్ గ్రూప్ ఎమ్మెల్యే, మాజీ మంత్రికి షాక్ ఇచ్చిన ఐటీ శాఖ అధికారులు8 ప్రాంతాల్లో సోదాలు, ఇప్పటికే అనేక చీటింగ్ కేసులతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులోని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వంపై తిరుబాటు చేసి మూడు వారాలకు పైగా రిసార్ట్ రాజకీయాలు చేస్తున్న ఆ రాష్ట్ర మాజీ మంత్రి, దినకరన్ గ్రూప్ లోని ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీకి ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు షాక్ ఇచ్చారు.

తమిళనాడు మాజీ మంత్రి రిసార్ట్ నుంచి ఎస్కేప్: దినకరన్ కు మద్దతు, చీటింగ్ కేసులో వేట !తమిళనాడు మాజీ మంత్రి రిసార్ట్ నుంచి ఎస్కేప్: దినకరన్ కు మద్దతు, చీటింగ్ కేసులో వేట !

గురువారం తమిళనాడులోని కరూరులో అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ ఇంటిలో ఐటీ శాఖ అధికారులు సోదాలు మొదలుపెట్టారు. రెబల్ ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ ఇంటితో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.

IT Raid at AIADMK MLA Senthil Balaji house in Karur.

సెంథిల్ బాలాజీ అక్రమాస్తులు గుర్తించడానికి మొత్తం 8 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం మీద తమిళనాడు ప్రభుత్వం మీద తిరుబాటు చేసిన అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీకి ఐటీ శాఖ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. ఇప్పటికే అనేక చీటింగ్ కేసులు నమోదు కావడంతో పోలీసులు అరెస్టు చేస్తారని కర్ణాటకలోని కొడుగు రిసార్ట్ నుంచి మంగళవారం తప్పించుకున్న సెంథిల్ బాలాజీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

English summary
IT Raid at Tamil Nadu former minister, AIADMK MLA Senthil Balaji house in Karur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X