బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాజీ ఉప ముఖ్యమంత్రికి ఐటీ షాక్, ఇల్లు, విద్యా సంస్థల్లో దాడులు, కాంగ్రెస్ టార్గెట్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ కు ఐటీ అధికారులు సినిమా చూపిస్తున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ ఇల్లు, ఆయన విద్యా సంస్థల మీద గురువారం ఆదాయపన్ను శాఖ (ఐటీ అధికారులు) దాడులు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన మాజీ ఉప ముఖ్యమంత్రితో పాటు ఆ పార్టీ మరో నాయకుడు ఆర్ ఎల్. జాలప్పకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు.

రెండుగా చీలిన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ, నువ్వానేనా, మాజీ సీఎంకు చెక్!రెండుగా చీలిన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ, నువ్వానేనా, మాజీ సీఎంకు చెక్!

మాజీ ఉప ముఖ్యమంత్రికి షాక్

మాజీ ఉప ముఖ్యమంత్రికి షాక్

బెంగళూరులోని డాక్టర్ జీ. పరమేశ్వర్ ఇల్లు, తుమకూరులోని మరళూరులోని సిద్దార్థ విద్యా సంస్థలు, డిగ్రీ కాలేజ్ లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. డాక్టర్ జీ. పరమేశ్వర్ కు చెందిన ఇల్లు, విద్యా సంస్థల్లో ఐటీ శాఖ అధికారులు రికార్డులు పరిశీలిస్తున్నారు.

చాల సంతోషం

చాల సంతోషం

ఐటీ దాడులు జరుగుతున్న సందర్బంగా మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ జీ. పరమేశ్వర్ మీడియాతో మాట్లాడారు. తన ఇల్లు, విద్యా సంస్థల మీద ఐటీ శాఖలు సోదాలు జరగడం చాల సంతోషంగా ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ వ్యంగంగా అన్నారు.

ఐటీ శాఖ క్లారిటీ

ఐటీ శాఖ క్లారిటీ

దాడులు, సోదాలు చెయ్యకూడదని ఐటీ అధికారులు చెప్పడం సరికాదని డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు. తాను చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించలేదని, అవినీతి సొమ్ము సంపాదించలేదని అన్నారు. తాను అవినీతికి పాల్పడ్డానా, లేదా అనే విషయంలో ఐటీ శాఖ అధికారులే క్లారిటీ ఇస్తారని మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు.

 ఎలాంటి అభ్యంతరం లేదు

ఎలాంటి అభ్యంతరం లేదు

సిద్దార్థ విద్యా సంస్థల మీద ఐటీ అధికారులు సోదాలు చేశారని ఇప్పటికే తనకు సమాచారం వచ్చిందని, ఆ వివరాలు సేకరిస్తున్నామని డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు. తాను అక్రమాలకు పాల్పడ్డానని వెలుగు చూస్తే ఐటీ శాఖా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు.

రాజకీయ కక్షలు

రాజకీయ కక్షలు

డాక్టర్ జీ. పరమేశ్వర్ ఇల్లు, విద్యా సంస్థల మీద దాడులు చేస్తున్న ఐటీ శాఖ అధికారులు మరో కాంగ్రెస్ పార్టీ నాయకుడికి చెందిన కోలార్ లోని ఆర్ ఎల్. జాలప్ప ఆసుపత్రి, దోడ్డబళ్లాపురంలోని సోమేశ్వర్ నగర్ లోని ఆయన కుమారుడి ఇంటిలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాజకీయ కక్షల కారణంతోనే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఐటీ దాడులు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి సిద్దరాయయ్య మండిపడుతున్నారు.

English summary
Karnataka: IT raid on Former Deputy Chief Minister G Parameshwara Residence In Bengaluru and Siddhartha Education Institution and college near Tumkur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X