వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటీ దాడులు, మాజీ ఉప ముఖ్యమంత్రికి అన్న కొడుకు విలన్, మెడికల్ సీటు రూ. కోటి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీలో ఎంతో ప్రభావం కలిగిన నాయకుల్లో ఒకరైన డాక్టర్ జీ. పరమేశ్వర్ పాలిట ఆయన అన్న కొడుకు, కన్నడ సినీ హీరో ఆనంద్ విలన్ ? గా తయారైనాడని ప్రచారం జరుగుతోంది. అందుకే డాక్టర్ జీ. పరమేశ్వర్ యాజమాన్యంలో నిర్వహిస్తున్న మెడికల్ కాలేజీలు, విద్యాసంస్థల మీద ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు దాడులు చేశారని సమాచారం. డాక్టర్ జీ. పరమేశ్వర్ యాజమాన్యంలో నిర్విహిస్తున్న మెడికల్ కాలేజ్ వ్యవహారాలను ఆయన అన్న కొడుకు ఆనంద్ చూసుకుంటున్నారని, ఈ కాలేజ్ లో జరిగిన అవ్యవహారాలు బయటకు రావడంతోనే ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారని తెలిసింది.

చిన్నమ్మ శశికళ ముందస్తు ముచ్చట లేనట్లేనా? జైల్లో లగ్జరీ లైఫ్ నిజమే, నివేదిక !!చిన్నమ్మ శశికళ ముందస్తు ముచ్చట లేనట్లేనా? జైల్లో లగ్జరీ లైఫ్ నిజమే, నివేదిక !!

 మెడికల్ సీటుకు రూ. కోట్లి వసూలు ?

మెడికల్ సీటుకు రూ. కోట్లి వసూలు ?

మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీప. పరమేశ్వర్ యాజమాన్యంలో నిర్వహిస్తున్న మెడికల్ కాలేజ్ లో యాజమాన్యం కోటా కింద ఒక్కో మెడికల్ సీటుకు సుమారు రూ. ఒక కోటి వరకూ వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. మెడికల్ సీట్లు అక్రమంగా విక్రయిస్తున్నారని ఆదాయపన్ను శాఖకు సమాచారం అందడంతో ఐటీ శాఖ దాడులు జరిగాయని, అందుకు ఆనంద్ అవ్యవహారాలే కారణం అని ప్రచారంజరుగుతోంది.

 మెడికల్ సీట్ల దందా

మెడికల్ సీట్ల దందా

ప్రైవేటు మెడికల్ కాలేజ్ లో రెండు రకాలుగా మెడికల్ విద్యార్థులకు సీట్లు కేటాయిస్తుంటారు. నీట్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ప్రభుత్వ కోటాలో, మెరిట్ ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ప్రభుత్వ కోటా, మెరిట్ ఆధారం కాలేజ్ లో చేరే విద్యార్థులకు ఫీజు తక్కువగానే ఉంటుంది. ప్రభుత్వ కోటా, మెరిట్ సీట్లు దక్కించుకోవడానికి విద్యార్థులు తీవ్రస్థాయిలో పోటీ పడుతుంటారు.నీట్ పరీక్షలు రాసీ సీటు దక్కని విద్యార్థులు మేనేజ్ మెంట్ కోటాలో సీట్లు దక్కించుకోవడానికి సీటు సంపాధించుకోవడానికి రూ. లక్షల్లో మేనేజ్ మెంట్ సీట్లు దక్కించుకోవడానికి డోనేషన్లు చెల్లించడానికి సిద్దం అవుతున్నారు.

 బ్లాక్ లో మెడికల్ సీట్లు విక్రయం !

బ్లాక్ లో మెడికల్ సీట్లు విక్రయం !

నీట్ పరీక్షల్లో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులు ప్రైవేటు కాలేజ్ లో విద్యాభ్యాసం చెయ్యడానికి ఆసక్తి చూపిస్తుంటారు. నీట్ పరీక్షల్లో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులు ప్రముఖ ప్రైవేట్ కాలేజ్ లో చేరడానికి సీట్లు బ్లాక్ చేస్తున్నారు. మంచి మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వ కాలేజ్ లో సీట్లు చిక్కుతున్నాయి. అయితే వేరే రాష్ట్రాల్లోని మంచి మెడికల్ కాలేజ్ లో సీట్లు వస్తే విద్యార్థులు అక్కడికి వెళ్లిపోతున్నారు. ఆ సీట్లకు మళ్లీ కౌన్సిలింగ్ లో భర్తి చెయ్యడానికి ప్రభుత్వానికి కష్టంగా తయారైయ్యింది. ప్రభుత్వ కౌన్సిలింగ్ పూర్తి అయిన తరువాత ఏదో ఒక కారణం ముందు పెట్టి ప్రైవేటు కాలేజ్ లో సీట్లు బ్లాక్ చేస్తున్నారు. ఈ సీట్ల దందాలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

 ప్రభుత్వ కోటా సీట్లు మేనేజ్ మెంట్ కోటాకు !

ప్రభుత్వ కోటా సీట్లు మేనేజ్ మెంట్ కోటాకు !

కౌన్సిలింగ్ పూర్తి అయిన తరువాత ప్రభుత్వం మళ్లీ మిగిలిన సీట్ల కోసం కౌన్సిలింగ్ నిర్వహించడం కష్టంగా ఉందని వదిలేయడంతో ఆ సీట్లు ప్రైవేట్ కాలేజ్ ల్లోని మేనేజ్ మెంట్ కోటాకు బదిలి అవుతున్నాయి. ఆ సమయంలో మెడికల్ కాలేజ్ మేనేజ్ మెంట్ ఒక్కో సీటును రూ. 75 లక్షల నుంచి రూ. ఒక కోటి వరకు విద్యార్థులకు అక్రమంగా విక్రయిస్తున్నారని సమాచారం. ఈ అక్రమ మెడికల్ సీట్ల విక్రయాల దందాలో పెద్ద కుంబకోణం జరుగుతుందని ఆదాయపన్ను శాఖ అధికారులకు సమాచారం అందింది.

 అన్న కొడుకు సీనిమా హీరో

అన్న కొడుకు సీనిమా హీరో

మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్న కొడుకు ఆనంద్. ఆనంద్ కన్నడ సినిమా హీరో. స్యాండిల్ వుడ్ లో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఏకే-56 సినిమాలో ఆనంద్ హీరోగా నటించాడు. డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్న, ఆనంద్ తండ్రి డాక్టర్ శివప్రసాద్. డాక్టర్ శివప్రసాద్ కేవలం డాక్టర్ జీ. పరమేశ్వరకు అన్న మాత్రమే కాదు, ఆయనకు గురువు కూడా. డాక్టర్ జీ. పరమేశ్వర్ రాజకీయ ఎదుగుదల, వ్యాపారాల్లో ఆయన అన్న డాక్టర్ శివప్రసాద్ కీలకంగా మారారు. ప్రతి విషయంలో డాక్టర్ జీ. పరమేశ్వర్ ను ఆయన అన్న డాక్టర్ శివప్రసాద్ ప్రోత్సహించారు. రాజకీయాల్లో పెద్ద పేరు సంపాదించుకోని డాక్టర్ శివప్రసాద్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, డాక్టర్ జీ. పరమేశ్వరకు అన్నగా, గురువుగా గుర్తింపు తెచ్చుకున్నారు.

English summary
Bengaluru: Anand is in charge of the Parameshwaras Medical College, Anand Is Villain To Parameshwara.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X