వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దినకరణ్‌కు మద్దతు ఎఫెక్ట్? : శరత్ కుమార్‌, ఆరోగ్యమంత్రి ఇళ్లల్లో ఐటీ సోదాలు

ఆర్కేనగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల నేపథ్యంలో ఐటీ దాడులు తమిళనాట కలకలం సృష్టిస్తున్నాయి. ప్రముఖ సినీ నటుడు శరత్ కుమార్ ఇంటిపై శుక్రవారం ఐటీ దాడులు జరుగుతున్నాయి. కొట్టివక్కమ్‌లోని శరత్ కుమార్ ఇంటిపై ఐటీ

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఆర్కేనగర్ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో ఐటీ దాడులు తమిళనాట కలకలం సృష్టిస్తున్నాయి. ప్రముఖ సినీ నటుడు శరత్ కుమార్ ఇంటిపై శుక్రవారం ఐటీ దాడులు జరుగుతున్నాయి. కొట్టివక్కమ్‌లోని శరత్ కుమార్ ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

శరత్ కుమార్.. ఆర్కే నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో దినకరణ్‌కు మద్దతు తెలిపిన నేపథ్యంలో ఆయన ఇంటిపై ఐటీ సోదాలు జరగడం గమనార్హం. అలాగే ఆరోగ్యమంత్రి విజయ్ భాస్కర్ ఇంటిపైనా ఐటీ దాడులు చేసింది. చెన్నైలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది.

IT raids at Tamil Nadu minister's residence and sarath kumar house

అంతేగాక, అన్నాడీఎంకే మాజీ ఎంపీ రాజేంద్రన్, ఎంజీఆర్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ గీతా లక్ష్మి, ఇతర పారిశ్రామికవేత్తల నివాసాలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. చెన్నై, పుదుకొట్టాయ్ సహా 30 ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. కాగా, ఆర్కే‌నగర్‌లో ఏప్రిల్‌ 12న ఉప ఎన్నికలు జరగనున్నాయి.

డబ్బుల పంపిణీ ఆరోపణలే కారణం

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్‌ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ దాడులు కొనసాగిస్తోంది. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న ఆర్కే నగర్‌ నియోజకవర్గంలో ఓటర్లకుఆయన డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు చెన్నైలోని ఆయన నివాసంతో పాటుపుదుక్కోటై, తిరుచ్చి, కోయంబత్తూరు సహా పలు ప్రాంతాల్లోని బంధువులు, స్నేహితుల ఇళ్లలో శుక్రవారం ఉదయం 7గంటల నుంచి సోదాలు చేస్తున్నారు.

మంత్రికి చెందిన క్వారీల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. అన్నాడీఎంకేలో సీనియర్‌ నేత అయిన విజయ్‌భాస్కర్‌ జయలలిత కేబినెట్‌లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం పళనిస్వామి కేబినెట్‌లోనూ అదే శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.

English summary
The income tax department conducted raids on on the residence of Tamil Nadu cabinet minister Vijaya Bhaskar and Actor Sarat Kumar on Friday. In an early morning operation, officials of the income tax department raided Vijaya Bhaskar's Chennai residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X