బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ ఎమ్మెల్యే, నైస్ అధినేతకు ఐటీ షాక్, ఇంటిలో భారీ మొత్తంలో నగదు, బీదర్, బెంగళూరులో!

|
Google Oneindia TeluguNews

బీదర్/బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా ఆదాయపన్ను శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేతలకు సినిమా చూపిస్తున్నారు. పోలింగ్ 24 గంటల సమయం కూడా లేని సందర్బంలో ఆదాయపన్ను శాఖ అధికారులు పంజా విసురుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పారిశ్రామికవేత్త, బీదర్ దక్షిణ నియోజక వర్గం ఎమ్మెల్యే అశోక్ ఖేణికి ఇంటిలో భారీ మొత్తంలో నగదు దాచిపెట్టారని సమాచారం రావడంతో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు.

షాక్ ఇచ్చిన ఐటీ శాఖ

షాక్ ఇచ్చిన ఐటీ శాఖ

బీదర్ దక్షిణ శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే, అదే నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త, నైస్ అధినేత అశోక్ ఖేణికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో శుక్రవారం ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. కొన్ని గంటల నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.

జిల్లాధికారి, సీఇవో ఎంట్రీ

జిల్లాధికారి, సీఇవో ఎంట్రీ

బీదర్ నగరంలోని రాంపురలో అశోక్ ఖేణి నివాసం, కార్యాలయం ఉంది. బీదర్ జిల్లాధికారి అనిరుద్ శ్రావణ్, జిల్లా సీఇవో డాక్టర్ సెల్వమణి నేతృత్వంలో ఆదాయపన్ను శాఖ అధికారులు అశోక్ ఖేణి నివాసం కార్యాలయాల్లో సోదాలు చేసి వివిద పత్రాలు పరిశీలిస్తున్నారు.

బెంగళూరులో దాడులు

బెంగళూరులో దాడులు

బెంగళూరు నగరంలోని సదాశివనగరలో అశోక్ ఖేణి నివాసం, కార్యాలయం ఉంది. సదాశివనగరలోని అశోక్ ఖేణి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. అశోక్ ఖేణికి చెందిన ఇళ్లు, కార్యాలయాల దగ్గర స్థానిక పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు.

కాంగ్రెస్, బీజేపీకి ఐటీ షాక్

కాంగ్రెస్, బీజేపీకి ఐటీ షాక్

శుక్రవారం కారవార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సతీష్ సైల్, ఆయన సన్నిహితుడు మంగళ్ దాస్ కామత్ ఇళ్లు, కార్యాలయాలల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. అదే సందర్బంలో గంగావతి శాసన సభ నియోజక వర్గం బీజేపీ అభ్యర్థి సోదరుడికి చెందిన హోటల్ లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన అశోక్ ఖేణికి ప్రస్తుతం ఆదాయపన్ను శాఖ అధికారులు సినిమా చూపిస్తున్నారు

English summary
Karnataka assembly elections 2018: Income tax officials conduct raids at Bidar and Bengaluru on houses and premises of Bidar Dakshin MLA Ashok Kheny.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X