వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: పకోడాలు అమ్మే వ్యక్తి ఇంటికొచ్చిన ఐటీ అధికారులకు రూ.60 లక్షలు ఇచ్చాడు!

|
Google Oneindia TeluguNews

Recommended Video

పకోడాలు అమ్మే వ్యక్తి ఇంటికొచ్చిన ఐటీ అధికారులు

లుధియానా: రోడ్డు పక్కన పకోడాలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమే.. అని ప్రధాని నరేంద్ర మోడీ గతంలో అన్నారు. ఈ సమయంలో విమర్శలు, అంతకుమించి సమర్థనలు వచ్చాయి. పకోడాలను, నిరుద్యోగాన్ని ఒకే గాటిన కట్టారని నరేంద్ర మోడీపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అదే సమయంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ గుర్తించాలని మోడీ మద్దతుదారులు విపక్షాలకు చురకలు అంటించారు.

బస్సు స్టీరింగ్‌పై కోతి: ప్రమాదకరమైన డ్రైవింగ్ కారణంగా డ్రైవర్ సస్పెన్షన్ (వీడియో)బస్సు స్టీరింగ్‌పై కోతి: ప్రమాదకరమైన డ్రైవింగ్ కారణంగా డ్రైవర్ సస్పెన్షన్ (వీడియో)

ఈ విషయాన్ని పక్కన పెడితే లుధియానాలో ఓ పకోడాలు అమ్ముకునే పన్నా సింగ్, అతని వారసులు ఏకంగా ఆదాయపన్ను శాఖ అధికారులకు తనంతట తానుగా రూ.60 లక్షలను సరెండర్ చేశారు. అతనికి పంజాబ్‌లోని లుథియానాలో రెండు పకోడా దుకాణాలు, స్నాక్స్ షాప్స్ ఉన్నాయి.

 ఇలా వార్తల్లో నిలిచాడు

ఇలా వార్తల్లో నిలిచాడు

అయితే ఈ పకోడా లేదా స్నాక్స్ దుకాణం కారణంగా ఆయన వార్తల్లోకి ఎక్కలేదు. కానీ అతని ఆదాయ లెక్కలు మాత్రం ఐటీ అధికారులకే కాదు, వినే వారికి షాకిస్తుంది. ఎందుకంటే తనంతట తాను అతను ట్యాక్స్ కట్టడా ఇంట్లో ఉన్న రూ.60 లక్షలను ఐటీ అధికారులకు ఇచ్చాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

పకోడాలు దుకాణదారు ఇంటికి ఐటీ అధికారులు

పకోడాలు దుకాణదారు ఇంటికి ఐటీ అధికారులు

పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వారి ఇళ్లకు ఆదాయ పన్ను శాఖ అధికారులు రావడం మనం చూస్తాం. కానీ, పన్నా సింగ్ ఇళ్లు, దుకాణాల్లో ఐటీ శాఖ అధికారులు తనిఖీ నిర్వహించారు. ఆయన ఎంత సంపాదిస్తున్నాడనే విషయంపై ఓ అంచనాకు రావడానికి పలు విషయాలను పరిశీలించారు.

రికార్డుల పరిశీలన

రికార్డుల పరిశీలన

అతనికి తమ ప్రాంతంలోని గిల్ రోడ్‌లో ఒక పకోడీల దుకాణం, మోడల్ టౌన్‌లో మరో దుకాణం ఉన్నాయి. అంతేగాక, ఆయన పలు రాష్ట్రాల్లోనూ పకోడీల దుకాణాలు నడుపుతున్నాడు. ఆయనకు సంబంధించిన ఐటీ రికార్డులను అధికారులు పరిశీలించారు. ఆయన దాఖలు చేస్తున్న ఐటీ రిటర్నులను, ఎంత పన్ను కట్టాడన్న వివరాలతో పాటు పలు వివరాలను అధికారులు ఆరా తీశారు.

రూ.60 లక్షలు ఇచ్చానని చెప్పాడు

రూ.60 లక్షలు ఇచ్చానని చెప్పాడు

పకోడీలు అమ్మే వ్యక్తి ఇంట్లో నల్లధనం ఏమైనా దొరికిందా? అనే విషయంపై అధికారులను మీడియా ప్రశ్నిస్తే, వారు ఈ విషయాన్ని వెల్లడించలేదు. కానీ దుకాణ యజమానిని ఇదే విషయమై అడగ్గా. ఐటీ రిటర్నుల్లో చూపకుండా దాచుకున్న రూ.60 లక్షలను స్వయంగా వారికి ఇచ్చానని చెప్పాడు. గిల్‌ రోడ్‌ ప్రాంతంలో 1952లో పన్నా సింగ్‌ అనే వ్యక్తి చిన్న పకోడీ దుకాణాన్ని మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ దుకాణ శాఖలు పంజాబ్‌లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. ఆ దుకాణాలను ఇప్పుడు పన్నా సింగ్ వారసులు నడుపుతున్నారు.

English summary
Panna Singh Pakore Wala runs a couple of modest desi snacks shops in Punjab's Ludhiana. On Thursday morning, he found a bunch of government officers lining up at his shop. They were there not to bite into his World Famous in Ludhiana pakoras but for his accounts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X