చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్యాగుల నిండా.. కట్టలుగా: రూ.77 కోట్లు సీజ్: హీరో విజయ్‌, నిర్మాతకు సమన్లు: ఉలిక్కిపడ్డ కోలీవుడ్.. !

|
Google Oneindia TeluguNews

Recommended Video

Good Morning India : 3 Minutes 10 Headlines | Actor Vijay It Raids | Astronaut Christina Koch

చెన్నై: కోలీవుడ్ టాప్ హీరో విజయ్, విజిల్ చిత్ర నిర్మాత, ఫిల్మ్ ఫైనాన్షియర్ అన్బు చెలియన్‌ నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు చేయడం తమిళ చిత్ర పరిశ్రమలో దుమారానికి దారి తీస్తోంది. ఈ దాడులు కోలివుడ్ పెద్దలను ఉలిక్కి పడేలా చేసింది. బుధవారం మధ్యాహ్నం ఆరంభమైన ఈ దాడులు గురువారం సాయంత్రం వరకూ కొనసాగాయంటే..వాటి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

రూ.77 కోట్లు, విలువైన డాక్యుమెంట్లు సీజ్..

రూ.77 కోట్లు, విలువైన డాక్యుమెంట్లు సీజ్..

చెన్నై, మధురైల్లో విజయ్, అన్బు చెలియన్‌కు చెందిన 38 కార్యాలయాలు, నివాసాలపై ఈ దాడులు కొనసాగాయి. ఈ సందర్భంగా ఐటీ అధికారులు ఏకంగా 77 కోట్ల లెక్క చూపని నగదును స్వాధీనం చేసుకున్నారు. కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) అధికార ప్రతినిధురాలు, ఆదాయపు పన్నుల శాఖ కమిషనర్ సురభి అహ్లూవాలియా గురువారం సాయంత్రం ఓ ప్రకటనలో వెల్లడించారు.

 300 కోట్లు రాబట్టిన విజిల్..

300 కోట్లు రాబట్టిన విజిల్..

విజయ్ నటించిన మూవీ బిగిల్. తెలుగులో ఈ సినిమా విజిల్ పేరుతో విడుదలైంది. ఈ సినిమా సక్సెస్ కావడమే ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులకు కారణమైందని అంటున్నారు. ఈ మూవీ 300 కోట్ల రూపాయలను రాబట్టిందని, దీనికి సంబంధించిన పన్నులనేవీ హీరో గానీ, ఫైనాన్షియర్ గానీ, నిర్మాతలు గానీ చెల్లించలేదనే ఆరోపణలు ఉన్నాయి. వాటి ఆధారంగా ఐటీ శాఖ అధికారులు దాడులను కొనసాగించారు.

 ఇద్దరికీ సమన్లు జారీ..

ఇద్దరికీ సమన్లు జారీ..

హీరో విజయ్, ఫైనాన్షియర్ అన్బు చెలియన్‌లకు ఐటీ అధికారులు సమన్లను జారీ చేశారు. బుధవారమే విజయ్‌ను అదుపులోకి తీసుకుని వారు విచారణ చేపట్టారు. విజయ్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థ ఏజీఎస్ సినిమాస్, ప్రముఖ ఫిల్మ్ ఫైనాన్షియర్ అన్బు చెలియన్ కార్యాలయంలోనూ ఐటీ అధికారులు సోదాలను నిర్వహించారు. విజయ్ నటిస్తోన్న మాస్టర్ సినిమా షూటింగ్ స్పాట్‌కు వెళ్లి మరీ ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం చర్చనీయాంశమైంది.

 బ్యాగుల నిండా.. నోట్ల కట్టలు

బ్యాగుల నిండా.. నోట్ల కట్టలు


ఈ దాడుల సందర్భంగా ఐటీ అధికారులు 77 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని తరలించడానికి ఓ మినీ టెంపోను వినియోగించారు. 77 కోట్ల రూపాయలను సర్దడానికి ఏకంగా 15 బ్యాగులను వారు తీసుకుని రావాల్సి వచ్చింది. ఈ డబ్బుకు సంబంధించిన ఎలాంటి బిల్లులు లేవని, ఇదంతా నల్లడబ్బేనని అధికారులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని సోదాలను నిర్వహించాల్సి ఉందని, దాని తరువాతే పూర్తి వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

English summary
Income Tax sleuths on Wednesday claimed to have recovered Rs 77 crore in unaccounted cash from several Tamil Nadu hideouts of a financier of the Tamil blockbuster ‘Bigil’ which featured popular local actor Vijay, who is also under investigation for suspected tax evasion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X