వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏం జరుగుతోంది: రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ముంబై సివిల్ కాంట్రాక్టర్లపై ఐటీ సోదాలు

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో పలువురు కాంట్రాక్టర్లపై ఐటీ దాడులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లోని సివిల్ కాంట్రాక్టు చేస్తున్న వ్యక్తులపైనే ఈ దాడులు జరగడం విశేషం. ఇక ముంబైలోని సివిల్ కాంట్రాక్టర్లతో పాటు గుజరాత్ సూరత్‌లోని సివిల్ కాంట్రాక్టర్లపై కూడా ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశమైంది.

 President's rule: షాకింగ్ ట్విస్ట్: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు: గడువు దాటిన మరుక్షణమే.. President's rule: షాకింగ్ ట్విస్ట్: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు: గడువు దాటిన మరుక్షణమే..

సోదాలు మొత్తం 37 ప్రాంతాల్లో జరిగాయి. ఇక లెక్కలను పరిశీలించిన ఐటీ శాఖ చాలామంది కాంట్రాక్టర్లు లోన్లు తీసుకున్నట్లు తమ ఖాతా పుస్తకాల్లో పొందుపర్చారని తేల్చాయి. ఆదాయంను కూడా కరెక్ట్‌గా చూపించలేదని ఐటీ శాఖ వెల్లడించింది .ఇక ఇప్పటి వరకు లెక్కలు లేని డబ్బులు రూ.735 కోట్లుగా ఉందని ఐటీ శాఖ వెల్లడించింది. ఇక సోదాల సందర్భంగా ఆదాయపు పన్ను శాఖ కొన్ని బోగస్ కంపెనీలను కనుగొంది. అంతేకాదు నకిలీ బ్యాంకు ఖాతాలు, ఫోర్జరీ సంతకాలు కూడా ఉన్నట్లు ఐటీ శాఖ తెలిపింది. కొంతమంది ప్రమోటర్లు స్థిరాస్తులపై ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పిన ఐటీ శాఖ ఇందుకోసం బ్యాంకుల నుంచి రుణాలు పొందారని పేర్కొంది.

IT raids on BMC civil contractors amid Shiv Sena BJP tensions

కాంట్రాక్టర్ల సమూహాలు బోగస్ కొనుగోళ్లు, సబ్‌ కాంట్రాక్టు పేర్లతో లోన్లు తీసుకోవడం వంటివి ఐటీశాఖ గుర్తించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం విచారణ చేస్తున్నామని చెప్పిన ఐటీ శాఖ.. త్వరలోనే ఈ బోగస్ కొనుగోళ్ల ద్వారా లబ్ది పొందిన ఇతరులను గుర్తిస్తామని చెప్పింది. రుణాలు పొంది నకిలీ లెక్కలను కాంట్రాక్టర్లు చూపించారని వెల్లడించింది. అంతేకాదు ఐటీశాఖకు దొరికన ఆధారాలను పరిశీలిస్తే పెద్ద ఎత్తున పన్నును కట్టకుండా ఎగవేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మనీలాండరింగ్‌కు కూడా ఈ కాంట్రాక్టర్లు పాల్పడినట్లు ఆదాయపు పన్నుశాఖ వెల్లడించింది. బ్యాంకులను ఒక పద్ధతి ప్రకారం మోసం చేశారని తమ విచారణలో తేలినట్లు ఐటీ శాఖ వివరించింది.

English summary
The Income Tax (I-T) department on November 6 conducted raids in Mumbai and Surat on civil contractors who work for the Brihanmumbai Municipal Corporation (BMC).So far, detection on account of the above mentioned issues is to the tune of Rs 735 crore and extent of accommodation entries is being quantified.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X