వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ, జైట్లీ శశికళ ఫ్యామిలీ నాశనం కోరుకుంటున్నారు, ఏంచేస్తారో చూస్తాం: టీటీవీ ఫైర్ !

ప్రధాని నరేంద్ర మోడీ, జైట్లీ మా నాశనం కోరుకుంటున్నారుజయలలిత మీద పళనిసామి, పన్నీర్ సెల్వంకు ఉన్న గౌరవం ఇదేమీ చేతనైంది చేసుకోండి, పారిపోము, ఎంతకాలం ఉంటారో చూస్తాం, శశికళ ఫ్యామిలీ

|
Google Oneindia TeluguNews

చెన్నై: జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో జరుగుతున్న ఆదాయపన్ను శాఖ దాడులు, శశికళ ఫ్యామిలీ మీద జరిగిన ఐటీ దాడుల విషయంలో అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ మండిపడుతున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ దాడులు చేస్తున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు.

Recommended Video

Narendra Modi in Chennai : PM Meets DMK Chief Karunanidhi

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆర్థికశాఖ మంత్రి జైట్లీలపై టీటీవీ దినకరన్‌ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. శనివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడిన టీటీవీ దినకరన్ ప్రధాని నరేంద్ర మోడీ, అరుణ్ జైట్లీ మా (శశికళ ఫ్యామిలీ) నాశనం కోరుకుంటున్నారని ఆరోపించారు.

కేంద్రం ఆదేశాలతో ఐటీ దాడులు

కేంద్రం ఆదేశాలతో ఐటీ దాడులు

కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఐటీ శాఖను మాకుటుంబంపై దాడులకు ప్రయోగిస్తున్నారని టీటీవీ దినకరన్ ఆరోపించారు. కేంద్రం కవ్వింపు చర్యలకు మేము భయపడే ప్రసక్తే లేదని టీటీవీ దినకరన్ అన్నారు. మేము ఎక్కడికి పారిపోము, ఇక్కడే ఉంటాం, మీకు చేతనైంది చేసుకోండి అంటూ టీటీవీ దినకరన్ ప్రధాని నరేంద్ర మోడీకి సవాలు విసిరారు.

అమ్మ కోసం మోడీ ఎందుకురాలేదు

అమ్మ కోసం మోడీ ఎందుకురాలేదు


జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే పార్టీని మిత్రపక్షంగా చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆమె ఆప్పత్రిలో ఉన్నంత కాలం ఒక్కరోజు కూడా పరామర్శించేందుకు రాలేదని టీటీవీ దినకరన్ గుర్తు చేశారు. జయలితను చూడటానికి కనీసం అరుణ్ జైట్లీ కూడా రాలేదని అన్నారు.

కరుణానిధి ఇంటికి వెళ్లారు

కరుణానిధి ఇంటికి వెళ్లారు

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ చెన్నై వచ్చినప్పుడు డీఎంకే పార్టీ చీఫ్ కరుణానిధి ఇంటికి ఎందుకు వెళ్లారని టీటీవీ దినకరన్ ప్రశ్నించారు. అయితే మోడీ, కరుణానిధి విషయాన్ని రాజకీయం చేయటం మాకు ఇష్టం లేదని టీటీవీ దినకరన్ అన్నారు.

అమ్మ మర్యాదను తాకట్టు పెట్టారు

అమ్మ మర్యాదను తాకట్టు పెట్టారు

అమ్మ జయలలిత గౌరవ మర్యాదలను కేంద్రం వద్ద తాకట్టుపెట్టి తమ పదువులను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రయత్నిస్తున్నారని టీటీవీ దినకరన్ మండిపడ్డారు. ఎంతకాలం కేంద్రం మీకు అండగా ఉంటుందో మేము చూస్తామని టీటీవీ దినకరన్ అన్నారు.

కన్నెత్తి చూడలేదు

కన్నెత్తి చూడలేదు

పోయెస్‌ గార్డెన్‌లో సోదాలు జరుగుతున్నంత సేపు తమ వర్గానికి చెందిన కార్యకర్తలే బయట ఆందోళన చేశారని, సీఎం పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన వారు ఒక్కరు కూడా అక్కడ కనిపించలేదని టీటీవీ దినకరన్ అన్నారు.

అమ్మ మీద ఇదే గౌరవం

అమ్మ మీద ఇదే గౌరవం

పోయెస్ గార్డెన్ లో ఐటీ శాఖ సోదాలు చేస్తుంటే అటు వైపు కన్నెత్తిచూడని పళనిసామి, పన్నీర్ సెల్వంకు అమ్మ జయలలిత మీద ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవాలని టీటీవీ దినకరన్ అన్నారు. పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో శశికళ గది, జయలలిత మేనేజర్ పున్ గంద్రన్ గదుల్లో సోదాలు చేసిన ఐటీ శాఖ అధికారులు ల్యాప్ టాప్, నాలుగు పెన్ డ్రైవ్ లు, పత్రాలు, జయలలిత లేఖలు స్వాధీనం చేసుకున్నారు.

English summary
Following the Income Tax raids at the Poes Garden residence of former Tamil Nadu Chief Minister J Jayalalithaa, sidelined AIADMK leader TTV Dinakaran today launched a blistering attack on Prime Minister Narendra Modi and Union Finance Minister Arun Jaitley.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X