వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Omicron:ఒమిక్రాన్ ఇప్పటికే ఉంది.. విదేశాల్లో.. ఎయిర్ పోర్టుల నుంచో రాలే: శాస్త్రవేత్త

|
Google Oneindia TeluguNews

ఒమిక్రాన్ వేరియంట్ గురించి కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. దేశంలో ఇప్పటికే 4 కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొత్త వేరియంట్ గురించి మాజీ సీఎస్ఐఆర్ చీఫ్, మాజీ సీసీఎంబీ చీఫ్ రాకేశ్ మిశ్రా సంచలన విషయం తెలియజేశారు. కరోనా వైరస్ ఇప్పటికే దేశంలో ఉందని హాట్ కామెంట్స్ చేశారు. విదేశాల నుంచి రాలేదని.. ఎయిర్ పోర్టుల నుంచి రాలేదని చెప్పారు. ఇప్పటికే ప్రధాన నగరాల్లో ఉందని వివరించారు.

తొలుత బెంగళూరులో కేసు వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ గుజరాత్ జామ్ నగర్‌లో ఒకటి, మహారాష్ట్రలో ఒక కరోనా కేసు వచ్చింది. ఇవీ విదేశాల నుంచి వచ్చినవారే కాదు అని.. ఇక్కడే వేరియంట్ ఉందన్నారు. ముఖ్య నగరాలకు అదీ పాకిందని చెప్పారు. అయితే ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ వల్ల సీరియస్ నెస్ లేదని చెప్పారు.

 It’s a Wake Up Call. Omicron Already Here, Its Not Coming From Abroad

ఇదీ ఒక వేకాప్ కాల్ వంటిదని వివరించారు. మరో రెండు వారాలు పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంటుందని వివరించారు. ఇప్పుడు మైల్డ్ సింప్టమ్స్ ఉన్నా.. తీవ్రత పెరిగే ఛాన్స్ ఉందన్నారు. దానిని వ్యాక్సిన్ తీసుకొని అరికట్టాలని కోరారు. ఫేస్ మాస్క్ తప్పనిసరి అని చెప్పారు. సామాజిక దూరం పాటించాలని సూచించారు. పరిశుభ్రతతో ఉండాలని కోరారు. వ్యాక్సిన్ డ్రైవ్‌లో దేశం ముందు ఉందని చెప్పారు.

వైరస్ నుంచి అరికట్టడంలో వ్యాక్సిన్ హెల్మట్ మాదిరిగా పనిచేస్తుందని తెలిపారు. యాక్సిడెంట్ నుంచి కాపాడుతుందని తెలిపారు. ఇదీ ఆస్పత్రిలో చేరడాన్ని.. మరణాన్ని తగ్గిస్తోందని తెలిపారు.

ఇటు హైదరాబాద్‌లో దిగిన ఓ లండన్ యువతీ నమూనాలను కూడా జినొమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. రాజస్తాన్, మిగత చోట్ల కూడా అనుమానితులు ఉన్నారు. కానీ వారికి ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ నిర్ధారణ మాత్రం కాలేదు. ప్రస్తుతం ఉన్న మూడు కేసులు తగ్గితే సరిపోతుంది. కానీ వారి వల్ల ఇతరులకు వ్యాప్తి చెందితెనే ప్రమాదం.

ఇటు సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకిన సంగతి తెలిసిందే. 66 ఏళ్ల వ్యక్తికి ట్రావెల్ హిస్టరీ ఉంది. అతను నవంబర్ 20వ తేదీన వచ్చారు. అప్పుడు నెగిటివ్ ఉండగా.. బెంగళూరు ఎయిర్ పోర్టులో పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. 22వ తేదీన జినొమ్‌కు పంపించగా.. 23వ తేదీన నెగిటివ్ వచ్చింది. అతను 24 మంది ప్రైమరీ, 240 సెకండరీ కాంటాక్ట్‌గా ఉన్నాయి. అతను దుబాయ్ ట్రావెల్ చేశాడు. అన్నీ ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ వెతికీ మరీ పరీక్షలను చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ వచ్చిన వారికి స్వల్పంగా లక్షణాలు ఉన్నాయని.. అందరూ రెండు టీకాలు తీసుకున్నారని వివరించారు.

English summary
“heavily mutated” virus is not just coming from airports, but is already here and likely to be present in all major cities, the former chief of CSIR-CCMB told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X