• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీజేపీకి బీహార్ సీఎం నితీశ్ షాకిచ్చారా? - లక్షల్లో ఉద్యోగాల హామీని పచ్చి బోగస్ అంటూ ఫైర్

|

తలసరి జీడీపీలో దేశంలోనే అట్టడుగున ఉండటంతోపాటు కరోనా లాక్ డౌన్ సమయంలో తీవ్రంగా ఎఫెక్ట్ అయిన బీహార్‌లో.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ప్రచారమంతా నిరుద్యోగం, ఉపాధి కల్పన అంశాల చుట్టూ తిరుగుతోంది. ఆర్జేడీ గనుక అధికారంలోకి వస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామంటూ తేజస్వీ యాదవ్ చేసిన వాగ్ధానాన్ని గేమ్ ఛేంజర్ గా పొలిటికల్ పండితులు అభివర్ణిస్తున్నారు. తేజస్వీ కంటే ఓ అడుగు ముందుకేసిన బీజేపీ.. ఏకంగా 19 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చింది. అయితే లక్షల్లో ఉద్యోగాల హామీలపై బీజేపీ మిత్రుడైన జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ వెర్షన్ మాత్రం మరోలా ఉంది..

ప్రవీణ్ ప్రకాశ్ దానికి పనికిరాడు -ఇవిగో ఆధారాలు -ఏపీకి అనర్ధం -మళ్లీ ఎదురుదెబ్బ: ఎంపీ రఘురామ

''10 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మట పచ్చి బోగస్. ఎన్నికల్లో గెలవడం కోసం ఎంతకైనా దిగజారే కొన్ని పార్టీల తప్పుడు హామీ అది. లక్షల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం ద్వారా ఓటర్లను తికమక పెట్టేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు'' అని నితీశ్ కుమార్.. ఆర్జేడీని ఉద్దేశించి విమర్శలు చేశారు. శుక్రవారం పర్వత్తాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయనీ కామెంట్లు చేశారు.

Its All Bogus: Nitish Kumar On Tejashwi Yadavs 10 Lakh Jobs Promise

జార్ఖండ్ విడిపోక ముందు ఉమ్మడి బీహార్ ను పాలించిన లాలూ ప్రసాద్ హయాంలో కేవలం 95వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, అదే గత 15 ఏళ్ల ఎన్డీఏ పాలనలో మాత్రం ఏకంగా 6లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని నితీశ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లో ఉద్యోగాల హామీని బోగస్ గా అభివర్ణించిన ఆయన.. ఈ ఆరోపణ బీజేపీకి వర్తిస్తుందా లేదా అనేది క్లారిఫై చేయలేదని, తద్వారా తేజస్వీతోపాటే కమలనాథులకు కూడా సీఎం షాకిచ్చినట్లుగానే భావించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఉద్యోగాలపై జేడీయూ ప్రత్యకమైన హామీ ఏది ఇవ్వలేదు.

షాకింగ్: 6నెలల్లో జగన్ 114 శాతం అప్పులు -కేసీఆర్‌తో చర్చలు -ఏపీ పోలీసులపైనా వైసీపీ ఎంపీ ఆరోపణలు

  Bihar Election Phase 1 : Difficulties Faced By Older People Due To EVM's Technical Problems

  మొత్తం 245 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. జేడీయూ చీఫ్ నితీశ్ నాయకత్వంలో బీజేపీ, హెచ్ఏఎం, వీఐపీ పార్టీలు ఎన్డీఏ కూటమిగా బరిలో నిలవగా, ఆర్జేడీ నేతృత్వంలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మహాకూటమిగా తలపడుతున్నాయి. ఎన్డీఏలోని ఎల్జేపీ ఈసారి విడిగా 137 సీట్లలో పోటీకి దిగింది. తొలి దశలో 16 జిల్లాల్లోని 71 స్థానాలకు బుధవారం(28న) పోలింగ్ జరగ్గా, 55.69 శాతం ఓటింగ్ నమోదైంది. మరో 17 జిల్లాల్లోని 94 సెగ్మెంట్లలో నవంబర్ 3న, మిగిలిన 15 జిల్లాల్లోని 78 నియోజకవర్గాల్లో నవంబర్ 7న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 10న ఫలితాలు వెలువడతాయి.

  English summary
  "Bogus baat hai (it's all bogus)," Nitish Kumar scoffed at a rally in Parbatta on Friday. He said these statements were primarily made to "misguide and confuse" voters. It is not known whether Nitish Kumar's caustic comments were also meant for ally BJP, which has promised four lakhs government jobs and 15 lakh employment opportunities in its election manifesto.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X