వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్పోసిస్‌ను వీడాలనే నిర్ణయం తీవ్రంగా బాధపెట్టింది: సిక్కా

ఇన్పోసిస్ సీఈఓ పదవికి రాజీనామా చేసిన విశాల్ సిక్కా తొలిసారి స్పందించారు.పోర్బ్స్ పత్రికకు సిక్కా రాజీనామా పరిణామాలపై ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ నిర్ణయం జీవితంలో తనను తీవ్రంగా బాధ పెట్టిందన్నారు సిక్కా.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: ఇన్పోసిస్‌ను వీడడం తన జీవితంలో అతి బాధాకరమైన సంఘటనగా మాజీ సీఈఓ విశాల్ సిక్కా అభిప్రాయపడ్డారు. ఇన్పోసిస్ సీఈఓ పదవికి రాజీనామా చేసిన అనంతరం తొలిసారిగా ఫోర్బ్స్ పత్రికకు సిక్కా ఇంటర్వ్యూ ఇచ్చారు.

అనివార్య పరిస్థితుల కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు సిక్కా.ఇన్నోవేటర్ల కంపెనీగా ఉండడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ, ఐకానిక్ ఇన్పోసిస్ నిలిచి గెలుస్తోందని ఆయన చెప్పారు.

It's critical for Infosys to be a company of innovators: Vishal Sikka

ఇన్పోసిస్ సీఈఓ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకోవడం తన జీవితంలో అత్యంత కష్టతరమైన నిర్ణయాల్లో ఒకటిగా సిక్కా గుర్తుచేసుకొన్నారు.

కానీ, తనకు లభించిన మద్దతు, స్పందన చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. ఈ సమయంలో 72 గంటల్లో కేవలం ఆరు గంటపాటు నిద్రపోయానని ఆయన చెప్పారు.

తన 50వ, పుట్టినరోజు సందర్భంగా తన గురువులాంటి స్నేహితుడు ఇచ్చిన హెర్మాన్ హెస్సే పుస్తకంతో పాటు జిడ్డు కృష్ణమూర్తి రాసిన ఫ్రీడ్ ఆఫ్ ది నోన్ పుస్తకాన్ని చదువుతున్నట్టు చెప్పారు సిక్కా.

గతనాన్ని మర్చిపోవడం ద్వారా కొత్తదనాన్ని తెలుసుకొంటున్నట్టు చెప్పారు. గతం నుండి స్వేచ్చ పొందడం మనల్ని మనం కొత్తగా అన్వేషించుకోవడానికి సహయపడుతోందన్నారు.

దీర్ఘకాలంగా నిర్లక్ష్యం చేసిన విషయాలపై పనిచేసేందుకు తనకు కొంత సమయం కావాలని , దీనిపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్టు చెప్పారు సిక్కా.

తన కుటుంబసభ్యులతో ఎక్కువ సమయాన్ని కేటాయించేందకు ప్రయత్నించనున్నట్టు చెప్పారు సిక్కా.తనకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అంటే మక్కువన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌లో ఏదో సాధించాలని భావిస్తున్నట్టు చెప్పారు సిక్కా.

English summary
“It is all a blur for now. I have barely slept for six hours in the last 72 hours. It was one of the hardest decisions of my life, but I feel that it had to be done,” Sikka tells Forbes India from his home in Palo Alto, in his first interview since his dramatic decision to step down.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X