బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు కరోనా భయం కొంచెం కూడా లేదు, అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి తల్లకిందులుగా శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది రెబల్ ఎమ్మెల్యేలు బెంగళూరు నగర శివార్లలోని రిసార్టులో ఎంజాయ్ చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఇంటి నుంచి వస్తున్న రుచికరమైన వంటకాలు ఆరగిస్తూ ఉల్లాసంగా క్రికెట్ ఆడుతూ సమీపంలోని స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ ఎవరికి నచ్చినట్లు వారు ఎంజాయ్ చేస్తున్నారు. దేశం మొత్తం కరోనా వైరస్ దెబ్బతో హడలిపోతుంటే మధ్యప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం అవి ఏమాత్రం పట్టకుండా, కొంచెం కూడా భయం లేకుండా బెంగళూరు శివార్లలోని రిసార్టులో ఎంచక్కా అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అంటూ ఎంజాయ్ చేస్తున్నారు.

Coronavirus:బెంగళూరులో మరో రెండు కరోనా కేసులు, మొత్తం 13, US, Spain యువతి !Coronavirus:బెంగళూరులో మరో రెండు కరోనా కేసులు, మొత్తం 13, US, Spain యువతి !

రెబల్స్ చేతిలో కమల్ నాథ్ భవిష్యత్తు !

రెబల్స్ చేతిలో కమల్ నాథ్ భవిష్యత్తు !

మధ్యప్రదేశ్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేల చేతిలో ఉంది. మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్, కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు.

అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు

అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు

మధ్యప్రదేశ్ కు చెందిన 22 మంది కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు బెంగళూరు నగర శివార్లలోని రిసార్టులో ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు రెబల్ ఎమ్మెల్యేలు విశాలమైన స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్నారు. మరి కొందరు ఎమ్మెల్యేలు క్రికెట్ ఆడుతున్నారు. ఇంకొదరు ఎమ్మెల్యేలు అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అంటూ ఆటాపాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు అందరికి రిసార్టు సమీపంలోని బీజేపీ ఎమ్మెల్యే ఇంటి నుంచి రుచికరమైన వంటకాలు సరఫరా చేస్తున్నారు.

కరోనా దెబ్బ కొంచెం కూడా కనిపించలేదు

కరోనా దెబ్బ కొంచెం కూడా కనిపించలేదు

మధ్యప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బెంగళూరు నగర శివార్లలోని రిసార్టుకు చేరుకున్న తరువాత కొన్ని రోజులు సమీపంలోని మాల్స్ లో షాపింగ్ చేసి ఉల్లాసంగా గడిపారు. అయితే కరోనా వైరస్ దెబ్బతో షాపింగ్ మాల్స్ మూతపడటంతో కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు రిసార్టుకే పరిమితం అయ్యారు. అయితే రెబల్ ఎమ్మెల్యేలకు బోర్ కొట్టకుండా చూడటానికి బీజేపీ నాయకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీలైనన్ని సరదా కార్యకలపాలతో రెబల్ ఎమ్మెల్యేలు కాలక్షేపం చెయ్యడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇలా ఉల్లాసంగా గడుపుతున్న కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ దెబ్బ కొంచెం కూడా కనిపించలేదని తెలిసింది.

ప్రెస్ మీట్ పక్కనే గుమగులాడే ఫుడ్స్

ప్రెస్ మీట్ పక్కనే గుమగులాడే ఫుడ్స్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్, కాంగ్రెస్ పార్టీ మీద తాము ఎందుకు తిరుగుబాటు చెయ్యాల్సి వచ్చిందో వివరించడానికి కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు మొదటి సారి రిసార్టు (బెంగళూరు)లో ప్రెస్ మీట్ పెట్టారు. రెబల్ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలోనే పక్కన ఉన్న టేబుల్ మీద బీజేపీ ఎమ్మెల్యే ఇంటి నుంచి వచ్చిన రుచికరమైన వంటకాలు గుమగుమలాడుతూ దర్శనం ఇచ్చాయని ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది.

Recommended Video

5 Minutes 10 Headlines || KCR Nominates Kavitha As MLC || Virus Impact On Indians Abroad
జేపీ నడ్డా ఆదేశాలు !

జేపీ నడ్డా ఆదేశాలు !

కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు ఎయిర్ పోర్టు)లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కర్ణాటక బీజేపీ నాయకులు కలిశారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలకు రిసార్టులో రుచికరమైన భోజనాలు అందడంలేదని వారు ఫిర్యాదు చేసిన విషయంపై చర్చ జరిగిందని తెలిసింది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన తరువాత రిసార్టులోని కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలకు భోజనాలు సరఫరా చేసే బాధ్యతను బీజేపీ ఎమ్మెల్యేకు అప్పగించారని, ఆ రోజు నుంచి ఆయన ఇంటి నుంచి రుచికరమైన ఆహారం రిసార్టుకు వస్తోందని తెలిసింది. మొత్తం మీద దేశం మొత్తం కరోనా వైరస్ భయంతో హడలిపోతుంటే బెంగళూరు నగర శివార్లలోని రిసార్టులో కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు.

English summary
Bengaluru: An aide of the local BJP MLA, who is delivering home-cooked delicacies for the Madhya Pradesh lawmakers, was seen driving out of the resort later in the evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X