• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హిందూ తీవ్రవాదం ఒక చారిత్రక సత్యం, ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు : కమలహాసన్

|

తమిళనాడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధ్యక్షుడు, కమలహాసన్ గాంధిని చంపిన నాథూరాం గాడ్సే పై చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసు నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం మధురై బెంచ్‌కు దరఖాస్తు చేశాడు. అయితే ఆయన పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. అంతకుముందు కమలహాసన్ పెట్టిన క్యాష్ పటిషన్‌ను సైతం కోర్టు కొట్టివేసింది. ప్రస్థుత సమయంలో ఆయన పిటిషన్ పై విచారణ చేపట్టలేమని కోర్టు తిరస్కరించింది. దీంతో మద్రాస్ కోర్టుకు సంబంధించిన మధురై బెంచ్‌లో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

తమిళనాడులోని అరవకురుచి అసెంబ్లీ నియోజవర్గంలో నిర్వహించిన ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలహాస్ భారతదేశ తొలి తీవ్రవాది ఒక హిందువంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. గాంధిని చంపిన నాథూరాం గాడ్సే‌ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. హిందు, నాన్ హిందు గ్రూపులు, పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగింది. ఈనేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలపై స్థానిక హిందు ఆర్గనైజేషన్‌కు చెందిన కేవీ రామక్రిష్ణ అనే వ్యక్తి ఆయన చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. దీంతో కమల హాసన్ పై మతాల మధ్య చిచ్చు పెట్టారన్న ఆరోపణలపై కేసు నమోదైంది.

Its historical truth : says Kamal Haasan

హిందు తీవ్రవాదంపై చేసిన వ్యాఖ్యలను నటుడు ,కమలహాసన్ సమర్ధించుకున్నారు. తాను చారిత్రక సత్యాలనే మాట్లాడనని స్పష్టం చేశారు.దీంతోపాటు ఆయనకు మద్దతుగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ కూడ ఆయన వ్యాఖ్యలను సమర్ధించారు. గాంధిని చంపింది ఎవరో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గాంధిని చంపిన వాడిని ఆకాశానికి ఎత్తడం ఏమిటని ప్రశ్నించారు. కాగా ఆయన వ్యాఖ్యలపై పలు రాజకీయ పార్టీలు , సినిరంగానికి చెందిన వారు ఖండించారు.

English summary
MNM chief Kamal Haasan approached the Madurai bench of the Madras High Court seeking anticipatory bail on Wednesday. This after the Karur police booked the actor for promoting enmity for stating that Nathuram Godse, the Hindu man who killed Mahatma Gandhi was Independent India’s first extremist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X