వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీనగాధ: ట్రంప్ ఒక్కరే కాదు...తల్లిదండ్రుల నుంచి పిల్లలను భారత్‌ కూడా వేరుచేస్తోంది

|
Google Oneindia TeluguNews

అమెరికాలో అక్రమ వలసదారులపై ఆదేశాధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. తల్లి దండ్రుల నుంచి పిల్లలను వేరుచేయడంపై అమెరికా మొదటి మహిళ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ కూడా దీనిని ఖండించారు. పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేయడం సరికాదన్నారు. దీంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతుండటంతో ట్రంప్ కాస్త వెనక్కు తగ్గారు. ఇది అమెరికా పరిస్థితి అయితే... మనదేశంలో కూడా మన ప్రభుత్వం ఇలాంటి పాపమే మూటగట్టుకుంటోంది.

బంగ్లాదేశ్‌నుంచి వివిధ కారణాలతో పొట్ట చేతపట్టుకుని పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశిస్తున్నారు కొందరు బంగ్లాదేశీయులు. ఇది గుర్తించిన భారత ప్రభుత్వం అలా అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిని పట్టుకుని సరైన పత్రాలు వారి దగ్గర లేకుంటే విదేశీ చట్టంలోని సెక్షన్ 14 ఏ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపుతోంది.

అయితే వచ్చేవారు తమ పిల్లలతో పాటు వస్తే ఆ పిల్లలను షెల్టర్ హోమ్స్‌కు తరలిస్తోంది. ఒక జైలులో తల్లిదండ్రులు మరో షెల్టర్ హోమ్స్‌లో పిల్లలు ఉంటున్నారు. దీంతో పిల్లల పరిస్థితి ఏంటో ఇక్కడ జైలులో ఉన్న తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలా ఒక్క పశ్చిమ బెంగాల్‌లోనే 80కి పైగా షెల్టర్ హోమ్స్ ఉన్నాయి.

ఐక్యరాజ్య సమితి నిబంధనలు ఏమి చెబుతున్నాయి..?

ఐక్యరాజ్య సమితి నిబంధనలు ఏమి చెబుతున్నాయి..?

ఇలాంటి ఘటననే మహానిర్బన్ కలకత్తా రీసెర్చ్ గ్రూప్‌నకు చెందిన సుచరిత సేన్‌గుప్తా 2015లో కొన్ని డాక్యుమెంట్స్‌ను విడుదల చేశారు. బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొన్న సమయంలో బాదురిబాలా అనే 40 ఏళ్ల మహిళ తన ఇద్దరి పిల్లలతో కలిసి అక్రమంగా భారత భూభాగంలోకి అడుగుపెట్టింది. ఈమెను అధికారులు గుర్తించి జైలుకు పంపగా ఆమె పిల్లలను మాత్రం షెల్టర్ హోమ్స్‌కు తరలించారు. ఆమెకు ఒక బాబు, ఒక పాప ఉండటంతో ఇద్దరి పిల్లలను వేర్వేరు షెల్టర్ హోమ్స్‌లో ఉంచారు. జైలులో ఉన్న బాదురిబాలా తన పిల్లలను 4 ఏళ్ల వరకు చూడలేదు. ఇది అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమంటున్నారు పలువురు సామాజికవేత్తలు.

ఐక్యరాజ్యసమితి

ఐక్యరాజ్యసమితి

పిల్లల హక్కులను కాపాడే ఐక్యరాజ్యసమితి కన్వెషన్‌లో భారత్‌కు కూడా సభ్యత్వం ఉంది. మరి భారత దేశం ఇలా తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరు చేయడం న్యాయం కాదని బంగ్లార్ మనబాధికర్ సురక్ష మంచా అనే స్వచ్ఛంధ సంస్థకు చెందిన బిప్లబ్ ముఖర్జీ గుర్తుచేశారు. ఐక్యరాజ్య సమితి నిబంధనల ప్రకారం తల్లిదండ్రులు పిల్లలను హింసించినా లేదా ఇతరత్ర కారణాలతో పిల్లలను మానసికంగా వేధిస్తే అప్పుడు పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి వేరుగా వచ్చేయొచ్చని బిప్లబ్ చెప్పారు. అది కూడా పిల్లల నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందన్నారు. అంతేకాదు తల్లిదండ్రులను అధికారులు అరెస్టు చేసి జైలుకు తరలిస్తే వారి పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని ఐక్యరాజ్యసమితి పిల్లల హక్కుల సమాఖ్య చెబుతోంది.

 మానవత్వంతో పనిచేస్తున్న బెంగాల్ జైళ్లు

మానవత్వంతో పనిచేస్తున్న బెంగాల్ జైళ్లు

ఇదిలా ఉంటే బెంగాల్‌లో ఇలాంటి కేసులను చాలా సున్నితంగా డీల్ చేస్తారని అక్కడి జైలు అధికారులు మానవత్వంతో వ్యవహరిస్తారని వెస్ట్ బెంగాల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఛైర్‌పర్సన్ అనన్య చక్రవర్తి చెప్పారు. కొన్ని జైళ్లలో తల్లితో పాటు పిల్లలు ఉండేందుకు కొందరు జైలర్లు అనుమతిస్తున్నారని ఇది తాను ప్రత్యక్షంగా చూసినట్లు అనన్య చెప్పారు. తల్లిదండ్రులు జైలులో ఉన్నసమయంలో వారిని చూసేందుకు పిల్లలను తమవెంటబెట్టుకుని జైలుకు తీసుకెళుతామని స్నేహ అనే ఎన్జీఓ సంస్థ సూపరింటెండెంట్ మమతా చక్రవర్తి చెప్పారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులను అధికారులు బంగ్లాదేశ్‌కు పంపిస్తారు.అలా వెళ్లిన వాళ్లు సరైన పత్రాలతో తిరిగి భారత్‌కు వచ్చి వారి పిల్లలను తీసుకెళతారు. అయితే తల్లిదండ్రులు బంగ్లాదేశ్‌కు వెళితే పిల్లలు మాత్రం ఇక్కడే ఉండటం సరైన పద్ధతి కాదంటున్నారు సామాజికవేత్తలు.

ఒక తల్లి బంగ్లాదేశ్ నుంచి బెంగాల్‌లోకి తన పిల్లలతో అడుగుపెట్టింది . ఆమెను అరెస్టు చేసి డమ్ డమ్ జైలుకు తరలించారు. పిల్లలను షెల్టర్ హోమ్స్‌కు పంపించారు అధికారులు. ఇద్దరి కేసులను వేర్వేరుగా కోర్టు స్వీకరిస్తుంది. వారి వాదనలు కూడా వేర్వేరు రోజుల్లో జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆ తల్లి పిల్లల్లో ఒకరు మృతి చెందారు. ఇది చాలా వేదనకు గురిచేసిందని ఇస్లాం అనే వ్యక్తి గుర్తుకు చేసుకున్నారు. ముందుగా తల్లిదండ్రులను బంగ్లాదేశ్‌కు పంపడం... ఆ తర్వాత పిల్లలను భారత్‌లోనే ఉంచడంతో పిల్లల అక్రమ రవాణా చేసేవారు ఇదొక అవకాశంగా మలుచుకుంటున్నారు. షెల్టర్ హోమ్స్‌లో ఉన్నది తమ పిల్లలేనంటూ తప్పుడు డాక్యుమెంట్లు చూపించి పిల్లలను తీసుకెళ్లి అసాంఘీక కార్యకలాపాల్లోకి దించుతున్నారు.

అమ్మాయిలను వ్యభిచార కూపంలోకి దించుతున్న దళారులు

అమ్మాయిలను వ్యభిచార కూపంలోకి దించుతున్న దళారులు

బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు పొట్ట చేత పట్టుకుని వస్తున్నారంటే అందుకు కారణం వారిని పీడిస్తున్న పేదరికమే. అక్కడ చాలా మంది వస్త్రాల దుకాణాల్లో పనిచేస్తారు. ఈ క్రమంలోనే కొందరు దళారులు వారిని టార్గెట్ చేసి మంచి పని ఇప్పిస్తామంటే నమ్మబలుకుతారు. వారిని నమ్మిన అమ్మాయిలు దళారులతో పాటు భారత్ వచ్చేస్తున్నారు. అయితే ఇక్కడ అధికారులు వారిని పట్టుకుని హిందీలో ప్రశ్నించే వరకు అమ్మాయిలు తాము భారత్‌లో ఉన్నట్లు తెలియడంలేదని కొందరు సామాజికవేత్తలు చెబుతున్నారు. అలా భారత్‌లోకి వచ్చిన వారిన వ్యభిచార కూపంలోకి దించుతున్నారు దళారులు. ఒక్క బెంగళూరు నగరంలో అక్రమంగా వచ్చి వ్యభిచారం చేస్తున్న అమ్మాయిల సంఖ్య బాగానే ఉంది.


భారత అధికారులు ఇలాంటి దళారులను కఠినంగా శిక్షించాలంటూ ఎన్జీఓ ప్రతినిధులు కోరుతున్నారు. అంతేకాదు తల్లిదండ్రుల నుంచి పిల్లలను ప్రభుత్వం వేరు చేయకుండా చర్యలు తీసుకోవాలని మానవతావాదులు వేడుకుంటున్నారు.

English summary
In the United States, the separation of 2,000 immigrant children from their families while crossing the border from Mexico this year has sparked outrage. But India has followed a similar policy for years, which has resulted in the separation of countless Bangladeshi families.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X