వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిఎస్టీ ఎఫెక్ట్: భారీగా డిస్కౌంట్ సేల్స్, వినియోగదారులకు బంపరాఫర్లు

జూలై 1వ, తేది నుండి దేశమంతా ఒకే పన్ను విధానం అమల్లోకి రానుంది. అయితే జీఎస్టీ అమల్లోకి రాకముందే పాతస్టాక్ ను విక్రయించుకొనేందుకుగాను డిస్కౌంట్లను కురిపిస్తున్నాయి కంపెనీలు.ఈ నెలాఖరువరకు వినియోగదారులకు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జూలై 1వ, తేది నుండి దేశమంతా ఒకే పన్ను విధానం అమల్లోకి రానుంది. అయితే జీఎస్టీ అమల్లోకి రాకముందే పాతస్టాక్ ను విక్రయించుకొనేందుకుగాను డిస్కౌంట్లను కురిపిస్తున్నాయి కంపెనీలు.ఈ నెలాఖరువరకు వినియోగదారులకు బారీ ఆఫర్లను కురిపిస్తున్నాయి.

ఇక ఫ్యూచర్ గ్రూప్ బిగ్ బజార్ అయితే , ప్రత్యేకంగా జూన్ 30వ, తేది అర్ధరాత్రి కూడ తమ స్టోర్లను తెరిచి ఉంచనున్నట్టు ప్రకటించింది.ఆ రోజుల సేల్ లో భాగంగా 22 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేసింది.ఇక ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కూడ బుదవారం అర్ధరాత్రి నుండి మళ్ళీ ప్రీ జీఎస్టీ సేల్ ను ప్రారంభించింది. ప్లిప్ కార్ట్ ప్రత్యర్థి అమెజాన్ ఇప్పటికే ఈ సేల్ ను రన్ చేస్తోంది.

pre gst

అమెజాన్ ఈ సేల్ ఈవెంట్లో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్స్ పై 40-50 వరకు డిస్కౌంట్లను అందుబాటులో ఉంచింది. అయితే ప్రీ జీఎస్టీ విక్రయాల గణాంకాలను మాత్రం విడుదల చేయడానికి అమెజాన్ నిరాకరించింది.

లక్ష రూపాయాల టివిని రూ.60 వేలకే కొనుగోలు చేయవచ్చు. మీకు ఈ సమాచారం అవసరం లేకపోతే మీ సమాచారం, స్నేహితులకు చెప్పండి, షాపింగ్ కు ఇదే మంచి సమయమంటూ అని ముంబై కు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. జీఎస్టీ తర్వాత పూర్తి ప్రయోజనం చేకూరని ఆరు నెలల క్రితమే స్టాక్ ను అమ్మేయడానికి ఆఫ్ లైన్ రిటైలర్లు సేల్ ఇన్ మోడల్ ను చేపడుతున్నాయని ఓ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రితేష్ ఘోషల్ చెప్పారు. అప్పీరెల్, షూస్, యాక్ససరీస్ ఉత్పత్తుల విక్రయాలు పెంచడానికి కూడ పెద్ద రిటైలర్లు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

డిజిటల్ లావాదేవీల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన మొబైల్ వాలెట్ కూడ ఆన్ లైన్ సోర్ట్ పేటీఎం మాల్ ద్వారా ప్రీ జీఎస్టీ సేల్ ను నిర్వహించింది. ఈ సేల్ లో భాగంగా గత నెల కాలంగా ఈ ఫ్లాట్ ఫామ్ పై ట్రాఫిక్ మూడింతలు పెరిగిందని, రిటైలర్ ఇన్వెంటరీకి క్లియర్ చేసుకోవడానికి ఇంది ఎంతో సహకరించిందని పేటీఎం మాల్ సీఓఒ అమిత్ సిన్హా చెప్పారు. జీఎస్టీ అమ్మకాలన్నీ జూన్ 30వ, తేది అర్ధరాత్రితో ముగుస్తాయన్నారు.

జూలై 1నుండి కొత్త అమ్మకాలను ప్రారంభిస్తామని ప్యూచర్ గ్రూప్ సీఈఓ కిషోర్ బియానీ తెలిపారు. చాలా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతున్నాయని, కానీ, ఎప్ఎంసీజీ కంపెనీలు వెయిట్ అండ్ వాచ్ పాలసీనీ చేపడుతున్నాయని పేర్కొన్నారు. జూలై 1 నుండి ధరలు తగ్గించేలా ప్రయత్నాలను ప్రారంభిస్తామన్నారు.

English summary
Shopaholics are on a high. With just 48 hours to go before GST kicks in, retailers across the country — from Big Bazaar to Amazon —are leading a last-minute charge to clear stocks.Consumers are treating it as an opportunity to stock up, as there are discounts galore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X